Bharatha Ratna : పీవీకి భారతరత్న అవార్డు .. అందుకున్న కుమారుడు

పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న పురస్కారాన్ని అందచేశారు;

Update: 2024-03-30 06:31 GMT
Bharatha Ratna : పీవీకి భారతరత్న అవార్డు .. అందుకున్న కుమారుడు
  • whatsapp icon

పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న పురస్కారాన్ని అందచేశారు. పీవీ కుటుంబంలో ఆయన కుమారుడు ప్రభాకర్ రావు పీవీకి భారతరత్న పురస్కారాన్ని స్వీకరించారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఇటీవల ప్రకటించిన ఐదుగురికి భారత రత్న పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంచేశారు.

అద్వానీ ఇంటికి వెళ్లి...
బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్, బీజేపీ అగ్రనేత ఎల్‌.కే అద్వాని, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాధన్ లకు భారత ప్రభుత్వం భారత రత్న అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈరోజు నలుగురికి భారత రత్న అవార్డును వారి కుటుంబ సభ్యులకు అందచేశారు. అద్వానీకి మాత్రం ప్రధాని మోదీ ఆదివారం ఆయనకు ఇంటికి వెళ్లి భారత రత్నను అందచేయనున్నారు.


Tags:    

Similar News