నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. పది వేల పోస్టులు భర్తీకి నోటిఫికేషన్

రైల్వే శాఖ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. 9,970 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది;

Update: 2025-03-27 04:06 GMT
railways,  9,970 posts, good news, unemployed
  • whatsapp icon

రైల్వే శాఖ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. 9,970 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో నిరుద్యోగులు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే వీలు కల్పించింది. రైల్వ రిక్రూట్ మెంట్ బోర్డు ఈ నియామకాలను భర్తీ చేయనుంది. అసిస్టెంట్ లోకో పైలెట్ ల పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించిదంి. అభ్యర్థులు వచ్చే నెల 10వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తులు...
దరఖాస్తులు చివరి తేదీ మే 9వ తేదీగా నిర్ణయించారు. పదో తరగతి, ఐటీఐ, డిప్లొమాతో పాటు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా నిర్ణయించింది. దీనికి కనీస వయసు పద్దెనిమిదేళ్లు.. గరిష్ట వయసు 33 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మూడేళ్ల వయోపరిమితిలో సడలింపు ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.


Tags:    

Similar News