మోగిన ఎన్నికల నగారా.. రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల

జూన్ 10న ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. అదే రోజు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు..;

Update: 2022-05-12 11:27 GMT
మోగిన ఎన్నికల నగారా.. రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల
  • whatsapp icon

న్యూఢిల్లీ : రాజ్యసభ ఎన్నికలకు నగారా మోగింది. దేశంలో 15 రాష్ట్రాల్లో 57 రాజ్యసభ సీట్లకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుపుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ విడుదల చేసింది. మే 24న నోటిఫికేషన్, నామినేషన్ల స్వీకరణకు తుది గడవు మే 31వ తేదీగా నిర్ణయించింది ఈసీ. జూన్ 1వ తేదీన నామినేషన్ల పరిశీలన, జూన్ 3 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇస్తున్నట్లు నోటిఫికేషన్లో తెలిపింది.

జూన్ 10న ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. అదే రోజు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు. మొత్తం 57 రాజ్యసభ స్థానాల్లో ఏపీ నుంచి నాలుగు, తెలంగాణ నుంచి రెండు ఎంపీ సీట్లు భర్తీ కానున్నాయి. ఏపీ ఎంపీలైన విజయసాయిరెడ్డి, సురేష్ ప్రభు, టీజీ వెంకటేష్, సుజనా చౌదరిల పదవీకాలం త్వరలోనే ముగియనుంది. అలాగే తెలంగాణ నుంచి కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, ధర్మపురి శ్రీనివాస్‌లు పదవీకాలం ముగియనుంది.


Tags:    

Similar News