20 కోట్లు ఇవ్వాలట.. ముకేష్ అంబానీకి బెదిరింపులు
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీకి బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. 20 కోట్లు చెల్లించకపోతే చంపేస్తానని బెదిరిస్తూ ఇమెయిల్ పంపారు. ముకేష్ అంబానీకి శుక్రవారం నాడు ఈ బెదిరింపు లేఖ వచ్చింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీకి బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. 20 కోట్లు చెల్లించకపోతే చంపేస్తానని బెదిరిస్తూ ఇమెయిల్ పంపారు. ముకేష్ అంబానీకి శుక్రవారం నాడు ఈ బెదిరింపు లేఖ వచ్చింది. తమకు రూ.20 కోట్లు ఇవ్వాలని అందులో డిమాండ్ చేశారు. తాము అడిగిన డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరించారు. దేశంలోనే మంచి షూటర్లు తమ దగ్గర ఉన్నారని హెచ్చరించారు. షాదాబ్ ఖాన్ పేరుతో దుండగులు అంబానీకి ఈమెయిల్ చేశారు. దీనిపై ముకేష్ వ్యక్తిగత సిబ్బంది ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, విచారణ చేపట్టారు. ఐపీసీ సెక్షన్ 387, 506 (2) కింద కేసు నమోదు చేసుకున్నట్లు వివరించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ముకేష్ అంబానీ ఇళ్లు ఆంటాలియా వద్ద సెక్యూరిటీని మరింత పెంచారు.
20 కోట్ల రూపాయలు ఇవ్వకుంటే చంపేస్తాం, మా వద్ద భారత్‌లో అత్యుత్తమ షూటర్లు ఉన్నారని బెదిరింపు ఇమెయిల్‌లో రాసి ఉందని ముంబై పోలీసులు తెలిపారు. గతంలో కూడా ముకేష్ ఇలాంటి బెదిరింపులను ఎదుర్కొన్నారు. హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిని, ముకేష్ నివాసం అంటాలియాను బాంబులతో పేల్చేస్తామని దుండగులు బెదిరించారు. ఈ కేసులో బీహార్ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. 2021 ఫిబ్రవరిలో ముఖేష్ అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం (SUV) కనుగొన్న సంగతి తెలిసిందే.