హైదరాబాద్ నుంచి ముంబయికి శ్యామ్ బెనెగెల్
భారతీయ సినిమాకు వన్నె తెచ్చిన ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనెగల్ మృతి చెందారు.
భారతీయ సినిమాకు వన్నె తెచ్చిన ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనెగల్ మృతి చెందారు. ఆయన వయసు 90 ఏళ్లు. అనారోగ్యంతో కొంతకాలంగా బాధపడుతున్న శ్యామ్ బెనెగెల్ ముంబయిలో మరణించారు. ఆయన ఎన్నో విలక్షణమైన సినిమాలు తీశారు. డ్యాక్యుమెంటరీలను రూపొందించారు. శ్యామ్ బెనెగెల్ స్వస్థలం హైదారబాద్. అయితే ఆయన ముంబయిలో స్థిరపడ్డారు. 1976 లో ఆయనకు పద్మశ్రీ, 1991లో పద్మభూషణ్ 2005లో ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు.
ఇటీవలే పుట్టిన రోజును...
ఆయన తన తన దర్శకత్వంలో భారతీయ సినిమాకు ప్రపంచ ప్రఖ్యాతిని సాధించి పెట్టారు. ఇటీవల ఆయన 90వ పుట్టిన రోజు వేడుకలు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరుపుకున్నారు. భారతీయ సినిమాలో నటించే వారు ఆయన చిత్రంలో నటించాలన్న కోరికను వ్యక్తపర్చేవారు. అలాంటి శ్యామ్ బెనెగెల్ హైదరాబాద్ లో పుట్టి, పెరిగినా ముంబయికి వెళ్లి చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకున్నారు. ఆయన మృతి పట్ల రాజకీయ నేతలు, చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖులు నివాళులర్పించారు.