నేటి నుంచి డిజిటల్ రూపాయి

రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేడు డిజిటల్ రూపీని విడుదల చేయనుంది. పైలట్ ప్రాజెక్టుగా ఈరోజు ప్రారంభించనుంది

Update: 2022-11-01 03:34 GMT

రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేడు డిజిటల్ రూపీని విడుదల చేయనుంది. పైలట్ ప్రాజెక్టుగా ఈరోజు ప్రారంభించనుంది. ఇది కేవలం టోకు లావాదేవీలకే ఉపయోగించాల్సి ఉంటుంది. చట్టబద్దమైన డిజిటల్ రూపాయి ఈరోజు నుంచి వస్తుండటంతో ఆసక్తికరంగా మారింది. తొలుత టోకు లావాదేవీలు, అనంతరం రిటైల్ లావాదేవీలకు ఈ డిజిటల్ రూపీని ఉపయోగించేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకోనుంది.

టోకు లావాదేవీలకే...
ప్రస్తుతం ఈ డిజిటిల్ రూపీ తొమ్మిది బ్యాంకుల ద్వారా మాత్రమే జారీ చేయనుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు తొమ్మిది బ్యాంకులకు మాత్రమే అవకాశం కల్పించింది. అలాగే ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే తొలుత దీనిని ఉపయోగించాల్సి ఉంటుందని రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. నెల రోజుల్లో రిటైల్ లావాదేవీలకు కూడా అవకాశం కల్పించనుంది. ప్రస్తుతానికి బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటక్ మహేంద్రా, యెస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, హెచ్‌ఎస్‌బీసీలతో పాటు ఎస్‌బీఐ కూడా ఉంది.


Tags:    

Similar News