ఆ యూనివర్సిటీలో ప్రొఫెసర్ బికినీ ఫోటోలు.. ఎవరి లీక్ చేశారో..?
యూనివర్శిటీలోని ఒక ప్రొఫెసర్ బికినీ ఫోటోలు హాట్ టాపిక్ గా మారాయి.;
కోల్‌కతాలోని సెయింట్ జేవియర్స్ యూనివర్శిటీలోని ఒక ప్రొఫెసర్ బికినీ ఫోటోలు హాట్ టాపిక్ గా మారాయి. దీంతో ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. తన కొడుకు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రొఫెసర్ బికినీలో ఉన్న ఫోటోలను చూస్తూ ఉన్నాడని విద్యార్థి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఆమెను యాజమాన్యం ఉద్యోగానికి రాజీనామా చేయమని అడిగింది. సెయింట్ జేవియర్స్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళ, తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో బికినీలో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. వాటిని అదే యూనివర్సిటీలో చదువుతోన్న 18 ఏళ్ల స్టూడెంట్ చూశాడు. ప్రొఫెసర్‌కు సంబంధించిన కొన్ని బికినీ ఫోటోలను నా కుమారుడు చూడటాన్ని నేను గమనించాను.. ఆ ఫోటోలను చూసి నేను నిర్ఘాంతపోయానని సదరు స్టూడెంట్ తండ్రి చెప్పుకొచ్చాడు. ఒక ప్రొఫెసర్ ఇలా లోదుస్తులు ధరించిన ఫోటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడం నిజంగా అవమానకరమని అతడు తెలిపాడు.