Big Breaking : రూ.2000 నోట్లను రద్దు చేస్తూ ఆర్బీఐ సంచలన నిర్ణయం
రూ.2 వేల నోట్లకు నకిలీ నోట్లు రావడం దేశ ఆర్థిక వ్యవస్థకే తీవ్ర నష్టం తప్పదని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.
రూ.2000 నోట్ల వినియోగాన్ని రద్దు చేస్తూ.. ఆర్బీఐ సంచలన ప్రకటన చేసింది. రూ.2 వేల నోట్ల కారణంగా నకిలీ నోట్ల వినియోగం పెరుగుతుందని ఎప్పటి నుంచో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రూ.2 వేల నోట్లకు నకిలీ నోట్లు రావడం దేశ ఆర్థిక వ్యవస్థకే తీవ్ర నష్టం తప్పదని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వినియోగదారులకు రూ.2 వేల నోట్లు ఇవ్వవద్దని బ్యాంకులను ఆదేశించింది. ఈ మేరకు అన్ని బ్యాంకులకు తాజాగా ఉత్తర్వులు వెలువరించింది.
ఆర్బీఐ జారీ చేసిన ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి రానున్నాయి. ఈ నిర్ణయం నేపథ్యంలో ఆర్బీఐ రూ.2 వేల నోట్లను చలామణి నుంచి తప్పించేస్తుంది. వినియోగదారులు తమ వద్దనున్న రూ.2 వేల నోట్లను ఈ నెల(మే) 23 నుండి సెప్టెంబర్ నెలాఖరు వరకూ మార్చుకునే అవకాశం కల్పించింది. కాగా.. 2018-19 ఆర్థిక సంవత్సరంలోనే రూ.2 వేల నోట్ల ముద్రణను నిలిపివేసినట్టు ఆర్బీఐ వెల్లడించింది.