Sabarimala : నేటితో ఆలయం మూసివేత.. క్యూకట్టిన అయ్యప్పలు
శబరిమల ఆలయం నేడు మూసివేయనున్నారు. ఈరోజు రాత్రి ఆలయాన్ని మూసివేయనున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం కమిటీ వెల్లడించింది
శబరిమల అయ్యప్ప ఆలయం నేడు మూసివేయనున్నారు. ఈరోజు రాత్రి 11 గంటలకు ఆలయాన్ని మూసివేయనున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం కమిటీ వెల్లడించింది. మండల పూజలు పూర్తి కావడంతో ఆలయాన్ని ఈరోజు మూసివేస్తుననారు. తిరిగి మకరవిలక్కు పూజల కోసం డిసెంబరు 30న ఆలయాన్ని తెరవనున్నట్లు తెలిపారు.
పదిహేను గంటలు...
అయితే చివరి రోజు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు శబరిమల కొండకు చేరుకుంటున్నారు. అయ్యప్ప దీక్షను విరమించేందుకు పూనుకుంటున్నారు. దీంతో స్వామి వారి దర్శనం పదిహేను గంటలకు పైగానే పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. ఇక జ్యోతి దర్శనం కోసం మకర సంక్రాంతి రోజున అధిక సంఖ్యలో భక్తులు చేరుకుంటారు. ఇందుకోసం ట్రావెన్ కోర్ దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది.