ఓటమి పై అఖిలేష్ ఏమన్నారంటే?

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందించారు;

Update: 2022-03-11 06:18 GMT

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందించారు. బీజేసీ సీట్ల సంఖ్యను తాము గణనీయంగా తగ్గించగలిగామని ఆయన చెప్పారు. తమ పార్టీ ఓటమి పాలయని గతంలో కంటే సీట్ల సంఖ్య బాగా పెరిగిందని అఖిలేష్ యాదవ్ అభిప్రాయపడ్డారు. రానున్న కాలంలో బీజేపీ సీట్ల సంఖ్య మరింత తగ్గుతుందని ఆయన జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో తమ సీట్ల సంఖ్యను రెండున్నర రెట్లను, ఓట్ల శాతాన్ని 1.5 శాతం పెంచుకోగలిగామని అఖిలేష్ యాదవ్ సంతృప్తి వ్యక్తం చేశారు.

నిరంతరం పోరాటమే...
బీజేపీ పై ప్రజలకు ఉన్న భ్రమలు తొలిగిపోయాయని అఖిలేష్ యాదవ్ అన్నారు. ప్రజాప్రయోజనాల కోసం తమ పార్టీ నిరంతరం పోరాడుతూనే ఉంటుందని ఆయన చెప్పారు. ప్రజా సమస్యలపై నిరంతరం తాము గొంతు విప్పుతామని, ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన చెప్పారు. ఈ ఎన్నికల్లో బీజేపీ కూటమికి 273, సమాజ్ వాదీ పార్టీకి 125 స్థానాల్లో విజయం సాధించింది.


Tags:    

Similar News