నిరుద్యోగులారా.. అలెర్ట్...సాయంత్రం వరకే గడువు... నేడే దరఖాస్తు చేసుకోండి

నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం గడువు నేటితో ముగియనుంది. పీఎం ఇంటర్నెట్‌షిప్ స్కీమ్ గడువు ముగియనుంది

Update: 2024-11-10 08:20 GMT

నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం గడువు నేటితో ముగియనుంది. పీఎం ఇంటర్నెట్‌షిప్ స్కీమ్ గడువు ముగియనుంది. నవంబరు పదోతేదీన చివరి తేదీగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు సాయంత్రంలోగా రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తులను చేసుకోవాల్సి ఉంది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను కార్పొరేట్ వ్యవహారా శాఖ మంత్రి ప్రకటించింది.

అర్హతలివే...
టెన్త్ క్లాస్, ఇంటర్మీడియట్ విద్యార్హతలు కలిగిన వారితో పాటు ఐటీఐ చదివిన వారు ఈ పీఎం ఇంటర్నెట్‌షిప్ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు కూడా ఈ పథకం కింద తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకునే వీలుంది. అభ్యర్థుల వయసు 21 నుంచి 24 ఏళ్ల వయసుకు మించి ఉండకూడదు. భారతీయ పౌరులయి ఉండాలి. వారే ఈ పీఎం ఇంటర్నెట్‌షిప్ స్కీమ్ కింద అర్హులని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.


Tags:    

Similar News