కేదార్‌నాథ్‌లో మంచు తుపాను
కేదార్‌నాథ్‌లో మంచు తుపాను సంభవించింది. దీంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు
కేదార్‌నాథ్‌లో మంచు తుపాను సంభవించింది.ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ గాంధీ సరోవర్ ప్రాంతంలో ఆదివారం ఉదయం మంచు తుపాను చెలరేగింది. కేదార్‌నాథ్ దామ్ వెనుక వైపు ఉన్న మంచుపర్వతం దగ్గర ఉదయం ఐదు గంటలకు మంచు తుపాను రావడంతో కొంత భయాందోళనలు నెలకొన్నాయి.
ప్రాణ, ఆస్తి నష్టం...
అయితే ఈ మంచు తుఫాను వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగలేదని అధికారులు తెలిపారు. పర్వతం మీద నుంచి మంచు కిందికి వచ్చిందని, ఇది కేదార్‌నాథ్‌లో అలజడికి కారణమైందని రుద్రప్రయాగ్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విశాఖ అశోక్ తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలిపారు.