ఆజం ఖాన్ ఎమ్మెల్యేగా అనర్హుడు.. శాసనసభ సభ్యత్వం రద్దు

Update: 2022-10-29 01:45 GMT

2019లో ద్వేషపూరిత ప్రసంగం కేసులో దోషిగా తేలిన తర్వాత సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ సభ్యత్వానికి అనర్హుడయ్యారు. ద్వేషపూరిత ప్రసంగం కేసులో రాంపూర్ కోర్టు గురువారం ఆజం ఖాన్‌కు మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.2000 జరిమానా విధించింది. దోషిగా తేలిన నేపథ్యంలో, ఎస్పీ నేత, రాంపూర్ ఎమ్మెల్యే ఆజం ఖాన్‌ను యూపీ శాసనసభ సభ్యత్వానికి అనర్హులుగా ప్రకటించినట్లు యూపీ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం శుక్రవారం ప్రకటించింది.

2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ఆజంఖాన్‌ను రాంపూర్ కోర్టు దోషిగా నిర్ధారించింది. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 153a (రెండు గ్రూపుల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), 505 (ప్రజా దురాచారానికి దారితీసే ప్రకటన) మరియు ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 125 కింద ఆజం ఖాన్ దోషిగా నిర్ధారించారు. 2019 విద్వేష ప్రసంగం కేసులో ప్రజాప్రతినిధుల కోర్టు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో ఆజంఖాన్‌ శాసనసభ సభ్యత్వం రద్దయినట్టు, రాంపూర్‌ అసెంబ్లీ సీటు ఖాళీ అయినట్టు అసెంబ్లీ సెక్రటేరియట్‌ ప్రకటించింది. ఈ మేరకు యూపీ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ ప్రదీప్‌ దూబే శుక్రవారం వెల్లడించారు. 2019 ఎన్నికల సమయంలో ఓ ఐఏఎస్‌ అధికారితోపాటు ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై తీవ్ర ఆరోపణలు చేసినందుకు ఆజంఖాన్‌పై కేసు నమోదైంది. 2019 ద్వేషపూరిత ప్రసంగం కేసులో రాంపూర్ కోర్టు ఆజం ఖాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అదే రోజు, రాంపూర్ కోర్టు ఈ కేసులో ఖాన్‌కు బెయిల్ మంజూరు చేయడంతో పాటు, శిక్షకు వ్యతిరేకంగా అప్పీల్ దాఖలు చేయడానికి ఆజం ఖాన్ కు సమయం ఇచ్చింది.


Tags:    

Similar News