Breaking: జమిలి ఎన్నికలపై లోక్ సభలో ఓటింగ్.. రిజల్ట్ ఏంటంటే?
లోక్ సభలో జమిలి ఎన్నికలకు సంబంధించి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలన్న దానిపై డివిజన్ కు స్పీకర్ ఓం బిర్లా ఆదేశించారు
లోక్ సభలో జమిలి ఎన్నికలకు సంబంధించి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలన్న దానిపై డివిజన్ కు స్పీకర్ ఓం బిర్లా ఆదేశించారు. లోక్ సభలో ప్రవేశపెట్టిన బిల్లును విపక్షాలు వ్యతిరేకించాయి. అయితే జేపీసీకి పంపాలంటూ కొన్ని పక్షాలు డిమాండ్ చేశాయి. కేంద్ర మంత్రి అర్జున్ మేఘావాలే, అమిత్ షాలు కూడా జేపీసీకి పంపాలని కోరడంతో స్పీకర్ ఓటింగ్ కు ఆదేశించారు. అన్నిపక్షాలు తమ సభ్యులు విధిగా సభకు హాజరు కావాలని విప్ జారీ చేయడంతో అందరూ లోక్ సభకు హాజరయ్యారు.
ఓటింగ్ తర్వాత...
జమిలి ఎన్నికలతో ప్రజాస్వామ్యానికి ఎటువంటి ముప్పు వాటిల్లదని,రాష్ట్రాలకు భంగం కలగదని అర్జున్ మేఘవాలే తెలిపారు. జమిలి బిల్లు ప్రవేశపెట్టడం, జేపీసీకి పంపడంపై ఓటింగ్ లోక్ సభలో జరిగింది. ఈ ఓటింగ్ లో జమిలి ఎన్నికల బిల్లును జేపీసీకిపంపడంపై జరిగిన ఓటింగ్ లో దానికి అనుకూలంగా 220 ఓట్లు, వ్యతిరేకంగా 149 ఓట్లు పోలయ్యాయి. లోక్ సభలో తొలిసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ ను నిర్వహించారు. వెంటనే సభ్యుల అభిప్రాయాలు స్క్రీన్ పై కనిపించాయి. సాధారణ మెజారిటీతోనే బిల్లుకు అనుమతి లభించింది.