నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు
పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నేటి నుంచి జరగనున్నాయి. ఈరోజు నుంచి ఐదురోజుల పాటు సమావేశాలు కొనసాగనున్నాయి
పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నేటి నుంచి జరగనున్నాయి. ఈరోజు నుంచి ఐదురోజుల పాటు సమావేశాలు కొనసాగనున్నాయి. ఈరోజు పాత భవనంలో మొదలై రేపు కొత్త భవనంలోకి సమావేశాలను మారుస్తారు. తొలి రోజు పార్లమెంటు సమావేశాల్లో దేశం డెబ్బయి ఐదేళ్లలో సాధించిన పలు అంశాలపై చర్చించనున్నారు. పలు కీలక బిల్లులను కూడా సభ ముందుకు వచ్చే అవకాశముంది. 75 ఏళ్ల ప్రయాణంపై తొలి రోజు చర్చ జరగనుంది.
అజెండాలో...
వీటితో పాటు ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి కూడా బిల్లులు ప్రభుత్వం సభ ముందుకు తేనుంది. అడ్వొకేట్స్ సవరణ బిల్లుతో పాటు దిప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లులు కూడా రానున్నాయి. అయితే ఈ సమావేశాల్లోనే జమిలి ఎన్నికలతో పాటు మహిళ రిజర్వేషన్ బిల్లు, ఉమ్మడి పౌరస్మృతి బిల్లులు కూడా వచ్చే అవకాశముందని చెబుతున్నారు. అయితే దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. దీనిపై దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. విపక్షాలు మాత్రం ఈ సమావేశాల్లోనూ ధరల పెరుగుదల, చైనా దురాక్రమణ, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై చర్చకు పట్టుబట్టనున్నాయి.