అన్నామలై కొరడాలతో కొట్టుకుంటూ...?
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై విన్నూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై విన్నూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. తను కొరడాతో కొట్టుకుని మరీ శపథం చేశారు. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం గద్దె దిగేంత వరకూ తాను విశ్రమించనని ప్రతిన బూనారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు మరింతగా క్షీణించాయని, విద్యార్థినులపై అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వం కేసులు కూడా నమోదు చేయడం లేదని ఆయన ఆరోపించారు.
చెప్పులు వేసుకోనని శపథం...
తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం దిగిపోయేంత వరకూ తాను చెప్పులు కూడా ధరించనని శపథం చేశారు. తమిళనాడులో శాంతిభద్రతలు క్షీణిస్తున్న సందర్భంలో తాను సత్యాగ్రహ దీక్షను చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. డీఎంకే ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. అన్నామలై చేసిన ఈ నిరసన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now