తమిళనాడులో వరద బీభత్సం.. ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్
తమిళనాడు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఐదు జిల్లాలకు ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది.;
తమిళనాడు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఐదు జిల్లాలకు ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కృష్ణగిరి, ధర్మపురి, సేలం, తిరుప్పూరు, ఏర్కాడ్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇక్కడ విద్యాసంస్థలకు కూడా సెలవు ప్రకటించారు. అనేక గ్రామాలు నీట మునిగాయి. పలు ప్రాజెక్టుల వద్ద గేట్లను ఎత్తివేసి వరద నీటిని కిందకు వదులుతున్నారు.
ివిద్యాసంస్థలకు సెలవులు....
కావేరి నదీ పరివాహక ప్రాంతాల్లో అనేక గ్రామాలు నీటమునిగాయి. వరదల కారాణంగా తమిళనాడు, కర్ణాటకల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అనేక గ్రామాలకు రహదారి సౌకర్యం దెబ్బతినింది. తేని జిల్లాలో జలపాతాల సందర్శనకు ప్రభుత్వం అనుమతిని నిలిపివేసింది. మెట్టూరు డ్యాం నుంచి లక్ష క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అమరావతి ప్రాజెక్టు వద్ద ఐదు గేట్లను ఎత్తివేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. నీట మునిగిన ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.