అకౌంట్ లోకి పదికోట్ల నగదు... విస్తుపోయిన వృద్ధురాలు

ఒక వృద్ధురాలి అకౌంట్ లోకి ఏకంగా పదికోట్లు నగదు వచ్చి జమ అయింది. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.;

Update: 2022-01-15 03:40 GMT
ten crores, bank account, tayamma, karnataka
  • whatsapp icon

ఒక వృద్ధురాలి అకౌంట్ లోకి ఏకంగా పదికోట్లు నగదు వచ్చి జమ అయింది. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు జిల్లాలోని గుంబళ్లిలో నివాసం ఉంటున్న తాయమ్య పింఛనుతో జీవితం కొనసాగిస్తుంది. నెలకు మూడు వేల రూపాయల పింఛను మాత్రమే ఆమె ఖాతాలో నెలకు జమ అవుతుంది.

బ్యాంకు అధికారుల ఆరా....
అయితే గత నెల 20వ తేదీన ఆమె ఖాతాలో పది కోట్ల 38 లక్షల నగదు వచ్చి చేరింది. పింఛను విత్ డ్రా చేసింది. అయితే ఆమె ఖాతలో పదికోట్ల పైగా నగదు ఉన్నట్లు గుర్తించారు. అయితే తాయమ్య బంధువు ఎనిమిది లక్షలు డ్రా చేయడానికి బ్యాంకుకు వెళ్లగా అనుమానం వచ్చిన బ్యాంకు సిబ్బంది ఆరా తీశారు. ఆమె ఖాతాలో పదికోట్ల నగదు ఉండటాన్ని గుర్తించి దీనిపై ఆరా తీస్తున్నారు. డబ్బు డ్రా చేయడానికి వీలులేదని బ్యాంకు అధికారులు ఈ లావాదేవీపై విచారణ జరుపుతున్నారు.


Tags:    

Similar News