Sabarimala : తిరువనంతపురంలో టెన్షన్.. శబరిమల ఎఫెక్ట్
తిరువనంతపురంలో ఉద్రిక్తత తలెత్తింది. శబరిమలలో సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం విఫలమయిందని బీజేపీ ఆందోళనకు దిగింది
తిరువనంతపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శబరిమలలో సరైన సౌకర్యాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయిందని ఆరోపిస్తూ బీజేపీ ఆందోళనకు దిగింది. రోజుకు శబరిమలకు లక్ష మంది భక్తులు చేరుకుంటుండటం... సరైన సౌకర్యాలు కల్పించడం లేదని బీజేపీ ఆరోపిస్తుంది. కిలోమీటర్ల వాహనాలు నిలిచపోయాయి. బీజేపీ శ్రేణులపై వాటర్ క్యానన్లతో అడ్డుకుంటున్నారు.
బీజేపీ శ్రేణులు
స్వామి వారి దర్శనం కోసం రోజుల తరబడి వెయిట్ చేయాల్సి రావడంతో కొందరు భక్తులు అయ్యప్పను దర్శించుకోకుండానే వెనుదిరుగుతున్నారు. రద్దీకి తగిన ఏర్పాట్లు చేయలేదని బీజేపీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో పోలీసులకు, బీజేపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు బీజేపీ శ్రేణులను అడ్డుకునేందుకు స్వల్పంగా లాఠీఛార్జిని చేశాయి. ఈరోజు ముఖ్యమంత్రి పినరయి విజయన్ శబరిమలలో భక్తుల రద్దీపై సమీక్ష చేయనున్నారు.