Fastag : నేటి నుంచి కొత్త నిబంధనలు.. వాహనదారులూ బీ అలెర్ట్
నేటి నుంచి ఫాస్టాగ్ నిబంధనల్లో మార్పులు వచ్చాయి. ఆగస్టు ఒకటో తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
నేటి నుంచి ఫాస్టాగ్ నిబంధనల్లో మార్పులు వచ్చాయి. ఆగస్టు ఒకటో తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఇందుకోసం ప్రజలు తమ ఫాస్టాగ్ ఖాతాలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. లేకపోతే వారికి టోల్ ప్లాజా వద్ద సమస్యలు ఎదురవుతాయి. మీరు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే మీ ఫాస్టాగ్ బ్లాక్‌లిస్ట్ అవుతుంది. కాబట్టి ఈ విషయాల్లో మీరు కచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిందే.ఫాస్టాగ్‌కి నిబంధనలలో వచ్చిన మార్పు ఏంటంటే మీరు కేవైసీ ప్రాసెస్‌ను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ కొత్త నిబంధన ప్రకారం ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం నుంచి వాడుతున్న ఫాస్టాగ్ ఖాతాలను మార్చాల్సి ఉంటుంది. ఇందుకో కోసం ఫాస్టాగ్ యూజర్లు తన ఖాతా ఇన్సూరెన్స్ తేదీని చెక్ చేసుకోవాలి. అవసరమైతే దాన్ని మార్చుకోవాలి.అదే సమయంలో మూడు సంవత్సరాల క్రితం తెరిచిన ఉన్న ఫాస్టాగ్ ఖాతాలు వారి కేవైసీని మళ్లీ అప్‌డేట్ చేసుకోవాలి. ఫాస్టాగ్ సేవ కోసం కేవైసీ పూర్తి చేయడానికి గడువు అక్టోబర్ 31వ తేదీ వరకు ఉంది.