Parlament : పార్లమెంటు ఆవరణలో గందరగోళం.. బీజేపీ ఎంపీకి గాయాలు
పార్లమెంటు ఆవరణలో అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ సభ్యుల మధ్య తోపులాట జరిగింది.
పార్లమెంటు ఆవరణలో అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ సభ్యుల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో బీజేపీ ఎంపీకి స్వల్ప గాయాలయ్యాయి. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెచ్ అంబేద్కర్ ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా అవమానపర్చారంటూ ర్యాలీగా పార్లమెంటుకు కాంగ్రెస్ సభ్యులు వచ్చారు. అయితే వారిని బీజేపీ సభ్యులు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది.
తోపులాటలో గాయపడిన...
ఈ తోపులాటలో ఒడిశా ఎంపీకి స్వల్ప గాయమైంది. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించి చకిత్స అందిస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి చంద్రప్రతాప్ సారంగి గాయపడటంతో ఒకింత ఉద్రిక్తత ఏర్పడింది. అయితే తమను అడ్డుకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించారని ఈ తోపులాటలో బీజేపీ ఎంపీ గాయపడ్డారని రాహుల్ గాంధీ తెలిపారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now