ఈ భూమి మీద తల్లితండ్రులను భగవంతుని స్వరూపంగా భావిస్తారు. ముఖ్యంగా తల్లిని నిజమైన దేవతగా భావిస్తారు, ఎందుకంటే తల్లి తన బిడ్డల కోసం చేయగలిగేది ప్రపంచంలో మరెవరూ చేయలేరు. పిల్లల కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టేది తల్లి. ఇది మనుషుల్లోనే కాకుండా జంతువులలో కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో 'మొసలి ఓ కోతి పిల్లలను నోట కర్చుకుని వెళ్తుంటే తల్లి కోత తన పిల్ల కోసం మొసలిని సైతం ఎదురించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మొసలి కోతి బిడ్డను తన ఆహారంగా మార్చుకుంది. ఆ కోతి పిల్లను నోటిలో పెట్టుకుని నీటిలోకి వెళ్తుండగా ఆడ కోతి మొసలిపై దాడి చేసి తన బిడ్డను రక్షించుకుంది. కోతి దాడి చేయడంతో మొసలిని పిల్ల కోతిని విడిచిపెట్టింది.
బాబూన్ అని పిలిచే కోతి దానిపై దాడి చేసి మొసలిని అక్కడి నుండి తరిమికొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో @TheBrutalNature ID పేరుతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. కేవలం 36 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 54 వేల మందికిపైగా వీక్షించగా, వందలాది మంది వీడియోను కూడా లైక్ చేశారు. అదే సమయంలో, వీడియో చూసిన తర్వాత, ప్రజలు వివిధ రకాల రియాక్షన్లు ఇచ్చారు.