పొరుగు రాష్ట్రాలకు పాకిన తిరుమల లడ్డూ వివాదం

తిరుమల లడ్డూ వివాదం ఇతర రాష్ట్రాలకు కూడా పాకింది. పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటకలో కూడా ఇది హాట్ టాపిక్ గా మారింది.

Update: 2024-09-21 06:04 GMT

తిరుమల లడ్డూ వివాదం ఇతర రాష్ట్రాలకు కూడా పాకింది. పొరుగున ఉన్న తమిళనాడులో కూడా ఇది హాట్ టాపిక్ గా మారింది. తిరుమలకు నెయ్యిని సరఫరా చేసిన ఏఆర్ ఫుడ్ ప్రాడక్ట్స్ తమిళనాడులోని పళని సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానానికి కూడా నెయ్యిని సరఫరా చేస్తుంది. దీంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమై ఏఆర్ ప్రాడక్ట్స్ లో దాడులు నిర్వహించింది.

కర్ణాటకలోనూ...
మరోవైపు కర్ణాటకలోనూ తిరుమల నెయ్యి వివాదం పాకింది. లడ్డూ తయారీకి నందిని నెయ్యి తప్పనిసరి చేస్తూ కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీపై తీవ్ర వివాదం తలెత్తిన నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. కర్ణాటక ప్రభుత్వ ఆధీనంలోని అన్ని ఆలయాల్లోనూ లడ్డూ తయారీకి నందిని నెయ్యి తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటకలోని అన్ని దేవాలయాలకు నందిని నెయ్యిని మాత్రమే సరఫరా చేసేలా ఉత్తర్వులు విడుదలయ్యాయి.


Tags:    

Similar News