Bihar : నేడు మరోసారి ముఖ్యమంత్రి పదవి?

నేడు తొమ్మిదోసారి బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు;

Update: 2024-01-28 02:32 GMT

నేడు తొమ్మిదోసారి బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈరోజు ఉదయం పది గంటలకు జేడీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సమావేశం అనంతరం గవర్నర్ ను కలసి నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించనున్నారు. తిరిగి సాయంత్రం బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ కూటమితో కుదిరిన ఒప్పందంతో నితీష్ కుమార్ ప్రస్తుతమున్న ఇండియా కూటమికి గుడ్ బై చెప్పేశారు.

బీజేపీతో కలసి...
బీహార్ రాజకీయాలు శరవేంగంగా మారిపోయాయి. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు మరోసారి బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీకి స్పీకర్ పదవితో పాటు ఇద్దరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ల పదవులు కూడా లభించనున్నాయి. ఉప ముఖ్యమంత్రులు కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. తర్వాత స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఈ కార్యక్రమానికి కేంద్రహోం మంత్రి అమిత్ షా, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు.


Tags:    

Similar News