సీతారాముల కళ్యాణం.. కమనీయం

నేడు సీతారామ కల్యాణం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరగనుంది.

Update: 2023-03-30 02:45 GMT

నేడు సీతారామ కల్యాణం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరగనుంది. ప్రధానంగా భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణాన్ని ప్రతి ఒక్కరూ వీక్షించాల్సిందే. వీధి వీధిన రాములోరి గుడి ఉంటుంది. ఆ గుడిలో నేడు సీతారాముల కల్యాణానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకున్నారు. భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో కన్నులపండగగా జరిగే సీతారాముల కల్యాణాన్ని చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భద్రాద్రికి చేరుకున్నారు. ఉదయం పది గంటల నుంచి సీతారాముల కల్యాణ వేడుక ప్రారంభం కానుంది.

వైభంగా ఏర్పాట్లు...
దీంతో భద్రాద్రిని అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు. ఆధ్యాత్మిక ఉట్టిపడేలా అందంగా తీర్చి దిద్దారు. ప్రభుత్వం తరుపును దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌లు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. భద్రత కోసం రెండు వేల మంది పోలీసులను ఏర్పాటు చేశారు. పది గంటల నుంచి ప్రారంభమయ్యే సీతారాముల కల్యాణం క్రతువును వీక్షించేందుకు పెద్ద పెద్ద స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News