మావోయిస్టు అగ్రనేత హతం?
మావోయిస్టు అగ్రనేత మడవి హిడ్మా మరణించారు. జవాన్లకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో హిడ్మా మరణించారు
మావోయిస్టు అగ్రనేత మడవి హిడ్మా మరణించారని తెలుస్తోంది. అధికారికంగా ఇంకా పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించలేదు. జవాన్లకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో హిడ్మా మరణించారని తెలుస్తోంది. బీజాపూర్ - తెలంగాణ సరిహద్దుల్లో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. హిడ్మా లక్ష్యంగానే జవాన్ల ఆపరేషన్ సాగింది. సుదీర్ఘ సమయం సాగిన ఈ ఎన్ కౌంటర్ లో హిడ్మా మరణించారని తెలిసింది. ఈ ఎన్ కౌంటర్ కు హెలికాప్టర్ ను కూడా భద్రతాదళాలు ఉపయోగించారు.
భారీ ఎన్ కౌంటర్...
సీఆర్పీఎఫ్ - కోబ్రా జాయింట్ ఆపరేషన్ లో హిడ్మా మరణించారని చెబుతున్నారు. హిడ్మా మృతితో మావోయిస్టులు బలమైన నేతను కోల్పోయినట్లయింది. మావోయిస్టుల్లో మడ్వాకు వ్యూహకర్తగా పేరుంది. ఛత్తీస్ ఘడ్ లోని బీజాపూర్ జిల్లాలో 23 మంది జవాన్లు అప్పట్లో ప్రాణాలు కోల్పోవడానికి కూడా హిడ్మాయే ప్రధాన కారణమని పోలీసులు చెబుతున్నారు. 1996లో హిడ్మా మావోయిస్టుల్లో చేరి అంచెలంచెలుగా ఎదిగాడు. మాటు వేసి దాడులు చేయడంలో దిట్ట. హిడ్మాపై 45 లక్షల రివార్డు కూడా ఉంది.