నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు
కేంద్ర బడ్జెట్ సమావేశాలు నేటినుండి ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు;

కేంద్ర బడ్జెట్ సమావేశాలు నేటినుండి ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగడంపై అఖిల పక్ష సమావేశంలో చర్చించారు. కేంద్ర బడ్జెట్ తొలి విడత సమావేశాలు నేటి నుంచి ఫిబ్రవరి 13 వరకు కొనసాగుతాయి. ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. రెండో విడత సమావేశాలు మార్చి 10వ తేదీ నుంచి ఏప్రిల్ 4 వరకు కొనసాగనున్నాయి.
రాష్ట్రపతి ప్రసంగంతో...
నేడు పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ప్రభుత్వం సాధించిన లక్ష్యాలను, సాధించిన పురోగతిని వివరించనున్నార. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తారు. రేపు ప్రవేశ పెట్టే బడ్జెట్ పై అనేక మంది ఆశలు పెట్టుకున్నారు. ప్రధానంగా ఆదాయ పన్ను పరిమితిని పెంచే అవకాశాలున్నాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి.రైతులకు, నిరుద్యోగులకు, ప్రభుత్వఉద్యోగులకు అనుకూలంగా బడ్జెట్ ను రూపొందించినట్లు తెలుస్తోంది.