నేడు "భారత్ పోల్" ప్రారంభం
నేరస్థులను ట్రాక్ చేసి పట్టుకునేందుకు భారత్ పోర్టల్ ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు;
జాతీయ, అంతర్జాతీయ నేరస్థులను ట్రాక్ చేసి పట్టుకునేందుకు ప్రత్యేక పోర్టల్ ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు. దీనికి భారత్ పోల్ అని నామకరణం చేశారు. సీబీఐ రూపొందించిన ఈ పోర్టల్ ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభిస్తారు. భారత్ లో నేరాలు చేసి విదేశాలకు పారిపోవడం లేదనిఇండియాలోనే ఎక్కడో ఒకచోట తలదాచుకుని ఉన్నా వారిని సులువుగా కనిపెట్టే వీలుంది.
క్రిమినల్స్ ను పట్టుకునేందుకు...
ఈ పోర్టల్ లో భారత్ పోలీసులు క్రిమినల్ రికార్డులు షేర్ చేయగలిగితే ఆ విరాలను అందుకుని అక్కడ పోలీసులు అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకునే అవకాశముంది. నేరగాళ్లు ఎక్కడ తలదాచుకున్నా వారిని ట్రాక్ చేసి పట్టుకునే టెక్నాలజీని నేడు అమిత్ షా ప్రారంభించనున్నారు. ఇప్పడు అవలంబిస్తున్న అనేక విధానాలకు ఈ పోర్టల్ తో ముగిసేలా చేస్తుందని సీబీఐ అధికారులు చెబుతున్నారు. సత్వరమే నేరగాళ్లను పట్టుకున్నందున ఆ కేసు కూడా త్వరితగతిన పరిష్కారమవుతుందని భావిస్తున్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now