అమర్నాధ్ యాత్రకు వెళ్లే వారికి గుడ్ న్యూస్
అమర్నాథ్ యాత్ర కు సంబంధించి భక్తులకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది;

అమర్నాథ్ యాత్ర కు సంబంధించి భక్తులకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది అమర్ నాధ్ యాత్రకు వెళ్లాలని భావిస్తున్న భక్తులు కి రిజిస్ట్రేషన్ ప్రారంభించింది. ఈ ఏడాది జూలై 3వ తేదీ నుంచి ఆగష్టు 9వ తేదీ వరకు జరిగే అమర్నాథ్ యాత్ర జరగనుంది. ఈ యాత్రలో పాల్గొనే భక్తులు తమ పేర్లను ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ...
ఈ ఏడాది అమర్ నాథ్ యాత్ర కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ యాత్రకు వెళ్లాలనుకునే వారు కచ్చితంగా ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. https://jksasb.nic.in/ వెబ్ సైట్ లో పాస్ పోర్టు సైజ్ ఫొటోతో పాటు హెల్త్ సర్టిఫికెట్, ఓటీపీ సమర్పించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి గ్రూప్ రిజిస్ట్రేషన్కూడా చేసుకునే వెసులుబాటును కల్పించింది.