నన్ను చచ్చిపోనివ్వండంటూ రాష్ట్రపతికి లేఖ రాసిన మహిళ

తనను, తమ కుటుంబాన్ని ఎంతగానో హింసిస్తూ ఉన్నారని;

Update: 2025-04-07 03:00 GMT
నన్ను చచ్చిపోనివ్వండంటూ రాష్ట్రపతికి లేఖ రాసిన మహిళ
  • whatsapp icon

తన తల్లిని సీనియర్లు వేధిస్తున్నారనే ఫిర్యాదు కారణంగా తనను, తమ కుటుంబాన్ని ఎంతగానో హింసిస్తూ ఉన్నారని, దయచేసి తనకు కారుణ్య మరణానికి అనుమతించాలని కోరుతూ ఉత్తరప్రదేశ్ లోని మాజీ డిప్యూటీ జైలర్ కుమార్తె రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాసింది. ఉత్తరప్రదేశ్ జైళ్ల శాఖలో పనిచేస్తున్న తన తల్లిని ఓ సీనియర్ అధికారి లైంగికంగా వేధిస్తున్నాడని, ఈ విషయంపై ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో నిరాశ చెందానని తెలిపారు. అధికారంలో ఉన్నవారితో పోరాడటం కష్టమని తెలిసినా, తన తల్లికి న్యాయం జరగాలని ఆమె కోరుతోంది. వారణాసి డిప్యూటీ జైలర్‌గా పనిచేసిన మహిళ, జిల్లా జైలు సూపరింటెండెంట్ ఉమేష్ కుమార్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. తనను వేధిస్తున్నాడని, కులం పేరుతో దూషిస్తూ అవమానించేవాడని ఆమె ఆరోపించింది. ఈ విషయమై బాధితురాలి కుమార్తె లాల్‌పుర్‌ పాండేపుర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మహిళా ఖైదీలను తన ఇంటికి తీసుకురావాలని ఉమేష్ సింగ్ తన తల్లిపై ఒత్తిడి చేసేవాడని, అందుకు తన తల్లి నిరాకరించడంతో బెదిరించాడని ఆ యువతి తెలిపింది. ఉమేష్ సింగ్‌పై అనేక వేధింపుల ఆరోపణలు ఉన్నప్పటికీ, జైళ్ల శాఖ అతనికి క్లీన్‌చిట్ ఇచ్చిందని ఆమె తెలిపింది. ఇటీవల ఉమేష్‌కు సంబంధించిన అసభ్య వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినా, అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని బాధితురాలి కుమార్తె తెలిపింది. గతంలో చనిపోవాలని అనుకున్నప్పటికీ, అలా చేస్తే ప్రజలు తన తల్లిని నిందిస్తారనే భయంతో ఆగిపోయానని లేఖలో వివరించింది. ఉమేష్‌పై చర్యలు తీసుకోకపోతే తమ కుటుంబాన్ని నాశనం చేస్తాడని భయపడుతున్నానని, ఈ క్రమంలోనే తమకు మరణం తప్ప మరో మార్గం లేదని కారుణ్య మరణం కోసం రాష్ట్రపతికి లేఖ రాసినట్టు తెలిపింది. ఉమేష్ సింగ్ కు గతంలో కూడా దుష్ప్రవర్తనకు సంబంధించిన చరిత్ర ఉందని ఆమె ఆరోపించారు. మాజీ డిప్యూటీ జైలర్ రతన్ ప్రియ విషయంలో కూడా అలాగే చేశాడని, మీరు ఆ విషయాన్ని ఆమెనే అడగవచ్చని ఆమె తన ఫిర్యాదులో రాసింది.


Tags:    

Similar News