మోడీ మరో సంచలన నిర్ణయం

Update: 2018-05-13 18:29 GMT

ఇకపై దేశంలోని రోడ్లపై విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోనున్నాయి. పర్యావరణ హితానికి పెద్దపీట వేయడమే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అన్ని విధాలా నష్టం తెస్తున్న డీజిల్, పెట్రోల్ వాహనాలకు స్వస్తి పలికి విద్యుత్ వాహన శకానికి తెరతీయాలంటే ప్రభుత్వ పరంగా ప్రజలకు చేయూత ఇవ్వాలని సర్కార్ భావించింది. ఈ మేరకు సరికొత్త విధానం ప్రవేశపెట్టింది. ఈ విధానం పూర్తిగా అమలయితే పర్యావరణానికి మేలు చేకూరడమే కాదు వేలకోట్ల డాలర్ల విదేశీ మారక ద్రవ్యం దేశానికి ఆదాఅవుతుంది.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాలసీ ఇదే ...

కొత్తగా విద్యుత్ వాహనాలను ఉపయోగించే వారికి ఆకుపచ్చ బోర్డు లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. గ్రీన్ పర్యావరణ హితాన్ని సూచించడం వల్ల ఈ బోర్డు వున్న వాహనాలకు ప్రత్యేక రాయితీలు లభించనున్నాయి. కేంద్రం ఇచ్చిన వరాలతో నగరాల్లో అన్ని చోట్ల పార్కింగ్ కి అనుమతి ఇస్తారు. అలాగే రద్దీ రూట్లలో కూడా వీటికి ప్రత్యేక ప్రాధాన్యత లభిస్తుంది. అంతేకాదు రహదారి రుసుం వసూలు చేసే టోల్ పన్ను లో తగ్గింపు ఇవ్వనున్నారు.

పెద్ద ఎత్తున ప్రోత్సహించనున్న ప్రభుత్వం ....

ఇంకా అనేక రాయితీలతో విద్యుత్ వాహనాల వాడకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం సంకల్పించడం పట్ల అంతా స్వాగతిస్తున్నారు. అయితే ఆటోమొబైల్ విడిభాగాల పరిశ్రమ పై దీనిప్రభావం గణనీయంగా పడనుంది. ప్రధాన వాహన కంపెనీలు ఇప్పటికే విద్యుత్ వాహనాల తయారీలో పడ్డాయి. ప్రజల్లో వీటి వాడకం పెంచేందుకు కేంద్రం తీసుకున్న ఈ చర్య ఫలిస్తే వాహనాల విడిభాగాల పరిశ్రమలు మూతపడిపోనున్నాయి. అయినప్పటికీ మహానగరాల్లో వాహనాకాలుష్యానికి చేరమగీతం పాడవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా విద్యుత్ వాహనాల వాడకం భారీగా పెరిగింది. భారత్ లో కూడా ఆదిశగా అడుగులు పడటం విశేషం.

Similar News