జగన్ ఉద్యమాన్ని తొక్కేశారు...!

Update: 2018-05-12 06:30 GMT

2014 లోక్ సభ లో విభజన బిల్లు అసలు ఆమోదమే పొందలేదని ఆ విషయంపై ప్రస్తుత పార్లమెంట్ లో నోటీసు ఇచ్చి చర్చించాలని అందుకు తనవద్ద వున్న రికార్డ్ లను, ఆధారాలను అప్పగించి టిడిపికి సహకరిస్తానన్నారు మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ కుమార్.. హాజరుపట్టిలో 353 వచ్చినట్లు ఉందని,78 మంది మంత్రులలో 67 మంది లోక్ సభలో ఉన్నారన్నారు. 83 మంది బిజెపి కాంగ్రెస్ 108 మంది హాజరయ్యారని తెలిపారు. వివిధ పార్టీల వారిని మార్క్ చేస్తే 169 మందిని అనుకూలంగా, వ్యతిరేకం సున్నాగా స్పీకర్ తేల్చడాన్ని ఉండవల్లి ప్రశ్నించారు. వాస్తవానికి 432 మంది సభలో ఉంటే బిల్లు పాస్ కావాలంటే సగం మందికి పైగా వుండాలని కానీ స్పీకర్ లెక్కలోనే సగం లేరని వెల్లడించారు ఉండవల్లి. తలుపులు డివిజన్ సమయంలో మూసే ప్రతిసారి చేస్తారని కానీ ఆ సమయంలో డివిజన్ జరగలేదని డివిజన్ అని స్పీకర్ ప్రకటించేలేదన్నారు. డివిజన్ ప్రవిజో ప్రకారం ప్రొవైడెడ్ డివిజన్ అన్నది లేదని తలుపులు మూసి లెక్కలు పెట్టి తీసుకోలేదని నాలుగేళ్ళుగా దీనిపై చర్చ తిరిగి ఎందుకు చేపట్టడం లేదని అరుణ కుమార్ నిలదీశారు. నైతికంగా, సాంకేతికంగా, చట్ట ప్రకారం ఏ లెక్కన చూసినా విభజన బిల్లు చెల్లని చెల్లదన్నారు ఉండవల్లి.

అందరిని పదేపదే కోరా ...

ఎన్నిసార్లు పార్లమెంట్లో ఈ అంశం చర్చించమని కోరినా టిడిపి బహిరంగంగా వైసిపి అంతర్గతంగా బిజెపికి సపోర్ట్ చేయడంతో రాష్ట్ర ప్రయోజనాలు నీరుగారుతున్నాయి. టిడిపి వైసిపిల నాయకత్వ లోపంవల్లే నోటీస్ కూడా ఇవ్వలేదన్నారు ఉండవల్లి. కనీసం వర్షాకాల సమావేశాల్లో అయినా ఏమి చేస్తారో చూడాలని అన్నారు. బాబు 25 పార్లమెంట్ సీట్లు ఇవ్వండి అంటున్నారు, జగన్ 25 సీట్లు సీట్లు కావాలంటున్నారు వీరిద్దరూ ఎలా తెస్తారు హోదా. ఏమిటి మీ వ్యూహం ? బీహార్ కి చెందిన మాజీ ఐఏఎస్ ఎన్ కె సింగ్ విభజన బిల్లుపై చర్చ సమయంలో మాట్లాడుతూ బీహార్ కి కూడా ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరారు. రఘురామ రాజన్ కమిటీ స్పెషల్ క్యాటగిరి రిపోర్ట్ ఇస్తూ బీహార్, యుపి, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వెనుకబడిన రాష్ట్రాలుగా పేర్కొందని ఏపీకి ఇవ్వలిసి వస్తే మాకేంటి అని ఏ రాష్ట్రం మన డిమాండ్ కి అంగీకరిస్తుంది అని అరుణ కుమార్ లాజిక్ తీశారు. బీహార్ ఎంపీ గా గతంలో వున్న ఎన్ కె సింగ్ ప్రస్తుతం 15 వ ఆర్థికసంఘం ఛైర్మెన్ గా వున్నారని, ఆయన ఎపి డిమాండ్ను ఆనాడే ప్రశ్నించారని గుర్తు చేశారు ఉండవల్లి. చంద్రబాబు ఈరోజు మొదలు పెట్టారని కానీ ఫలితం ఏముందన్నారు. పుష్కరాల్లో ఎక్స్ గ్రేషియా దెబ్బలు తిన్న వారికి ఆరోజు చాలా మందికి ఇళ్ళకు వెళ్లి ఇచ్చేశారని అదే తరువాత కొందరు రాని వారు ఆఫీసులు చుట్టూ తిరిగినా పని జరగలేదని కారణం టైమింగ్ అని తేల్చారు అరుణ కుమార్.

చంద్రబాబును ఎలా నమ్మాలి ...?

అసలు ఏమిటి మీ వ్యూహం ? ఎలా చెప్పగలరు హోదా తెస్తారని ? ప్రజలకు క్లారిటీ ఇవ్వండి. మిమల్ని ఎలా నమ్మాలి అని ప్రశ్నించారు ఉండవల్లి. నాడు జరిగిన విభజన సభపై పుస్తకం రాసానని సుప్రీం కోర్టు జడ్జి చలమేశ్వర్ ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారని అది చదివిన ప్రజల్లో చైతన్యం కలిగినా ప్రధాన రాజకీయ పక్షాల్లో ఎలాంటి స్పందన లేకపోవడం శోచనీయమన్నారు అరుణ కుమార్. గత పార్లమెంట్లో జరిగిన తప్పును తరువాత పార్లమెంట్లో ఎందుకు ప్రశ్నించరు? ఎందుకు నోటీసు ఇవ్వరు ? సరిచేసే ప్రయత్నం ఎందుకు చేయరు ? అని నిలదీశారు మాజీ ఎంపి. గతంలో ఇందిరాగాంధీ అంతకు ముందు తప్పు చేశారని ఆర్కే ధావన్ కేసులో ప్రివిలేజ్ మూవ్ చేసి నేరుగా పార్లమెంట్ నుంచి ఆమెను జైలుకు పంపారని చిక్ బల్లాపూర్ లో గెలిచినా ఆ ఎన్నిక చెల్లదని జనతాపార్టీ తేల్చిన సంగతి మరోసారి గుర్తు చేశారు ఉండవల్లి. గత లోక్ సభ తప్పు చేస్తే తరువాత సభ ఎందుకు సరిచేయకూడదో చంద్రబాబు ఆలోచించాలన్నారు. పార్లమెంట్లో తుమ్మినా దగ్గినా రికార్డ్ ఉంటుంది అని చెప్పారు ఆయన. గోద్రా అల్లర్లపై నేను ప్రశ్నిస్తే నా మీద కక్ష కట్టారని కర్నూల్ సభలో చంద్రబాబు చెప్పారని, రాబోయే ఎన్నికల్లో బిజెపి గెలవదని కానీ ప్రతిపక్షంలో ఉంటుందని మరిచిపోవద్దన్నారు. హోదా రావాలంటే ప్రతిపక్షం కూడా సహకరించాలి కదా అలాంటప్పుడు చంద్రబాబు పై కక్ష కట్టిన బిజెపి ఎలా వూరుకుంటుంది. మీతో గొడవ రాగానే ప్రత్యేక రాయలసీమ అని ఉద్యమాన్ని బిజెపి లేవనెత్తిందని మర్చిపోయారా అని ఉండవల్లి అన్నారు. మిగిలిన రాష్ట్రాలు ఎందుకు హోదా ఇవ్వడానికి ఇష్టపడతాయి ? 25 సీట్లు ఇస్తే స్పెషల్ స్టేటస్ ఎలా ఇస్తారు ? అధికారపక్షం, ప్రతిపక్షం రెండు హోదా అడుగుతున్నాయి గా అందులో భేదాభిప్రాయం లేదుగా ఇప్పుడు 25 సీట్లు వున్నట్లే గా అని క్వశ్చన్ చేశారు అరుణ కుమార్.

ఉద్యమాన్ని అణచివేశారు....

మీకున్న మీడియా బలంతో తొలిరోజు నుంచి ఉద్యమిస్తున్న జగన్ ను హోదా ఉద్యమంలో హైజాక్ చేశారు. ఇదే మోసం ఇంకా ఎన్నాళ్ళు చేస్తారు ? విభజన కు ముందు రాజమండ్రి సుబ్రమణ్య మైదానంలో చెప్పా. ఇక్కడ సైకిళ్ళు తొక్కడం మీటింగ్స్ ఎందుకు ? అందరు హోదా కోరుతున్నారు అలాంటప్పుడు ఉద్యమం దేనికి ? జగన్ ఉద్యమిస్తే తిట్టేవారు, విశాఖలో అరెస్ట్ చేయించారు, ఆ ఉద్యమాన్ని ఉపయోగించుకుని అనుకూలంగా మార్చుకుని మోడీపై వత్తిడి తెచ్చి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదుగా అని నిలదీశారు మాజీ ఎంపి. స్పీకర్ ఒప్పుకోరు కాంగ్రెస్ ను ఒప్పించి నోటీస్ ఇస్తే అధికార విపక్షాలు ఒకరి తప్పులు మరొకరు ఎత్తి చూపి ఉండేవారు అది చేయలేదు. పార్లమెంట్లో డైరెక్ట్ గా ప్రధాని చెబుతారా ? తలుపులు మూసి ఏపీకి అన్యాయం చేశారని మరి ఈ ద్రోహం ఎందుకు చేస్తున్నట్లు ? మీరు నోటీస్ ఎందుకు ఇవ్వరు ? కోర్ట్ లో ఎందుకు వేయించారు ? కెవిపి వేసిన దానికి కౌంటర్ ఎందుకు వేయరు ? ఈ ఏడాది ఫిబ్రవరి 8 న కోర్ట్ లో అడిషనల్ అఫిడవిట్ దాఖలు చేశా. రికార్డ్ లు అఫిడవిట్ లో వేశా. మిమ్మల్ని అన్యాయం చేశారు ద్రోహం చేశారని అమరావతికి వచ్చిన ప్రధాని మట్టి నీరు ఇచ్చినప్పుడు స్పెషల్ కేటగిరి ఇస్తున్నందుకు ధన్యవాదాలని తరువాత నాలుక కరుచుకోలేదా అన్నారు ఉండవల్లి ? అప్పటికే మీకు హోదా రాదని తెలుసా

Similar News