జనసేనకు భారీ షాక్.. పార్టీ గుర్తు లాగేసుకున్న ఈసీ
జనసేన విషయానికొస్తే.. 2019 ఎన్నికల్లో 6 శాతం ఓట్లు సాధించినా.. రెండు స్థానాల్లో గెలవడంలో పార్టీ అభ్యర్థులు విఫలమయ్యారు.
జనసేన పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ గుర్తుగా ఉన్న గ్లాజు గ్లాసును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చుతూ.. ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈసీ తీసుకున్న ఈ నిర్ణయంలో జనసేన ఆ గుర్తును దాదాపు కోల్పోయినట్టే. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం.. ఏ రాజకీయ పార్టీ అయినా తన గుర్తును నిలుపుకోవాలంటే.. ఎన్నికల్లో పోటీ చేయడంతో పాటు.. పోలైన ఓట్లలో 6 శాతం కలిగి ఉండాల్సి ఉంటుంది. అలాగే కనీసం రెండు స్థానాల్లోనైనా అభ్యర్థులు గెలిచి ఉండాలి. అలా ఉంటేనే ఆ పార్టీకి ప్రాంతీయ పార్టీ గుర్తింపు లభిస్తుంది.
జనసేన విషయానికొస్తే.. 2019 ఎన్నికల్లో 6 శాతం ఓట్లు సాధించినా.. రెండు స్థానాల్లో గెలవడంలో పార్టీ అభ్యర్థులు విఫలమయ్యారు. ఫలితంగా ఆ పార్టీ గుర్తును కోల్పోవాల్సి వచ్చిందని ఈసీ స్పష్టం చేసింది. గతంలో బద్వేలు, తిరుపతి లోక్ సభకు జరిగిన ఉపఎన్నికల్లో ఇదే గాజు గ్లాసు గుర్తును ఇతరులకు కూడా ఈసీ కేటాయించింది. తాజాగా తెలంగాణలో గాజుగ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చడంతో పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.