వీళ్లతో కలసి యుద్ధమా?

తెలంగాణ బీజేపీ విన్యాసాలు చూస్లుంటే నవ్వొస్తుంది. ఇంకా ఓల్డ్ ట్రెడిషన్స్ ను కంటిన్యూ చేస్తున్నారనిపిస్తుంది

Update: 2023-09-25 02:49 GMT

తెలంగాణ బీజేపీ విన్యాసాలు చూస్లుంటే నవ్వొస్తుంది. ఇంకా ఓల్డ్ ట్రెడిషన్స్ ను కంటిన్యూ చేస్తున్నారనిపిస్తుంది. సినిమా వాళ్లను చేర్చుకోవడం ద్వారా పార్టీ బలోపేతం అవుతుందని భావిస్తున్నారు. సినిమా రంగం నుంచి ఎవరు వచ్చి చేరుతున్నా కండువా కప్పేసి గంతులేస్తున్నారు. బలం పెరిగిపోయిందని జబ్బలు చరుచుకుంటున్నారు. నిజంగా సినిమా వాళ్లకు ఇప్పుడు అంత క్రేజ్ ఉందా? అంటే లేదనే అందరికీ తెలుసు. కానీ బీజేపీ మాత్రం ఓల్డ్ ఫార్మాట్ లోనే ముందుకు వెళుతుంది.

విజయశాంతి వల్ల…
కొంత కాలం క్రితం విజయశాంతి వచ్పారు. విజయశాంతి అంటే కొంత తెలంగాణ రాములమ్మగా పేరు. ఆమెకు కొద్దో గొప్పో అభిమానులున్నారు. మన తెలంగాణ బిడ్డ అని కొంత పాజిటివిటీ అయినా ఉంది. అందుకే ఆమె అన్ని సార్లు పార్టీలు మారి వచ్చినా చేర్చుకుని మంచి ప్రాధాన్యత ఇచ్చారు. ఇవ్వడంలో కూడా తప్పలేదు. విజయశాంతి ఎంత మేరకు పార్టీకి ఉపయోగపడుతుందదంటే చెప్పలేం కాని, నష్టం అయితే ఆమె రాక వల్ల లేదనే చెప్పాలి. కనీసం ఆమె పోటీ చేస్తే గెలిచినా గెలవకపోయినా డిపాజిట్లు అయితే దక్కుతాయి.
ఏం ఉఫయోగం?
ఇక జీవితను చేర్చుకున్నారు. జీవిత వల్ల ఏం ఉపయోగం ఉందో పార్టీ నేతలకే తెలియదు. వేదికపై కుర్చీ తప్ప ఏ మాత్రం పార్టీకి ప్లస్ కారని లీడర్లకూ తెలుసు. కానీ ఎవరో ఒకరు పార్టీలోకి వస్తుంటే లైమ్ లైట్ లో ఉంటుందని చేర్చుకోవడమే. ఇక తాజాగా జయసుధకు కూడా కండువా కప్పేశారు. కేవలం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించడం కోసమే ఆమెను పార్టీలోకి ఆహ్వాానించారని అనుకోవాలని తప్ప మరొకటి కాదు. జయసుధను చూసి తెలంగాణలో ఓటు వేసే వారు ఎవరైనా ఉన్నారా? అన్న ప్రశ్నకు సమాధానం దొరకదు.
కండువాలు కప్పేసి…
ఈ సినిమా వాళ్లు 24 గంటలు రాజకీయం చేయలేదు ఎండలకు తిరగలేదు. వర్షంలో తడవలేరు.. ప్రజల్లో తిరగలేరు. వాళ్లకు వాళ్లు ప్రత్యేకమని భావిస్తారు. తమ వల్ల పార్టీకి ఉపయోగం ఉంటుందని భ్రమిస్తారు. కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి వాళ్లు కమలం పార్టీ వైపు చూస్తున్నారు తప్పించి లేకుంటే ఈ గడప తొక్కడానికి కూడా ఇష్టపడరు. ప్రచారంలో కూడా వారు కష్టపడరు. ఏదో మమ అని పించి వెళ్లిపోతారు. అటువంటి వారితో కమలం పార్టీ అధికార పార్టీని ఢీకొనాలనుకోవడం ఏమిటి? వీళ్లతో యుద్ధం చేసి గెలవడానికేనా? కాదు… ఏదో గ్లామర్ కోసం పార్టీలో చేర్చుకున్నా వారి వల్ల ఉపయోగం మాత్రం గుండుసున్నా అని చెప్పక తప్పదు. మరి బీజేపీ వీళ్లను చేర్చుకుని సాధించేదేమిటో చేరే వారికీ తెలియదు. చేర్చుకునే వారికీ తెలియకపోవచ్చు. కానీ ప్రజలకు మాత్రం స్పష్టంగా తెలుసు. వీళ్లకు ఓటేస్తే మళ్లీ కనపడరని.




Tags:    

Similar News