ఆ దిశగా చంద్రబాబు పావులు
ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే మిగిలి ఉండటంతో.. టీడీపీ అధినేత చంద్రబాబు తన ఎన్నికల టీమ్‌ను సిద్ధం చేసుకుంటున్నారు.
ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే మిగిలి ఉండటంతో.. టీడీపీ అధినేత చంద్రబాబు తన ఎన్నికల టీమ్‌ను సిద్ధం చేసుకుంటున్నారు. ప్రీ పోల్స్ వచ్చినా, షెడ్యూల్ ప్రకారం ఎన్నికల జరిగినా రెడీగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని ఆయా నియోజకవర్గాల్లోని టీడీపీ నేతలు వారి లోపాలను సరిచేసుకోవాలని చంద్రబాబు సూచిస్తున్నారు. ఇబ్బందులు ఉంటే.. సమన్వయం చేసుకోవాలని, పార్టీ మేనిఫెస్టోను జనంలోకి తీసుకెళ్లాలని ఆ పార్టీ నేతలకు ఆదేశాలిస్తున్నారు. అలాగే ఎలాంటి ఇబ్బంది లేని నియోజకవర్గాల్లో ఆశావహులకు క్లియరెన్స్ ఇస్తూ.. నియోజకవర్గాల్లోని ప్రజలను నిత్యం కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెబుతున్నారు.
అభ్యర్థుల ఖరారు విషయమై చంద్రబాబు.. చివరి వరకూ ఆలస్యం చేస్తారని ఒక అపవాదు ఉంది. అయితే చివరి నిమిషంలో టికెట్ కన్ఫర్మ్ చేయడం ద్వారా ప్రతికూల ప్రభావం అధికంగా పడుతుంది. ఇలా చివరకు ఆలస్య చేయడం మంచిది కాదని భావిస్తున్న టీడీపీ అధినాయకత్వం.. ఈ సారి ముందుగానే అలర్ట్ అవుతున్నారు. పార్టీ నాయకులను, శ్రేణులను అలర్ట్ చేస్తున్నారు. ఇటీవల ముందస్తు ఎన్నికలపై రకరకాల ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే అందుకు తగ్గట్టుగా చంద్రబాబు పావులు కదుపుతున్నారు. ఇక తాజాగా టీడీపీ ఇంచార్జ్‌లు నిమ్మల రామానాయుడు (పాలకొల్లు), మండలి బుద్ధ ప్రసాద్ (అవనిగడ్డ), బొండా ఉమామహేశ్వరరావు (విజయవాడ సెంట్రల్), తంగిరాల సౌమ్య (నందిగామ), శ్రీరాం తాతయ్య (జగ్గయ్యపేట)లతో చంద్రబాబు విడివిడిగా సమీక్ష చేసి పలు సూచనలు ఇచ్చారు.
నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులపై సమీక్ష చేసి చంద్రబాబు.. లోపాలను సరిదిద్దుకోవడంపై సూచలన ఉచేశారు. తాను ఎవరీని వదులుకునేందుకు సిద్ధంగా లేనని, మంచిగా పని చేస్తే తన ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందని, ఒక వేళ పనిచేయకపోతే తాను మరొకరికి వెతుక్కుంటానని చంద్రబాబు హెచ్చరించినట్టు పార్టీ వర్గాల నుంచి సమాచారం. ఒక అడుగు వెనక్కి వేసైనా.. అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లాలని, పని చేయకపోతే ఊరుకోనని పార్టీ నేతలకు చంద్రబాబు స్పష్టం చేసినట్టు రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే నియోజకవర్గ ఇంచార్జిలు ఫైనల్ అభ్యర్థులు కాబోరని మహానాడు వేదికగా నారా లోకేష్ ప్రకటించడంతో.. పార్టీ నేతల్లో కలవరం మొదలైంది.