Nara Lokesh : ఒక్కటే ఒక్క పాజిటివ్ అంశం... మిగిలిదంతా సేమ్ టు సేమ్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు

Update: 2023-12-31 07:54 GMT

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు. ఆయన మరోసారి సాహసానికి దిగుతున్నారు. ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకుంటున్నారన్న చర్చ పార్టీలో జరుగుతుంది. సేఫ్ ప్లేస్ చూసుకోవాలి కానీ.. ఓడిపోయిన చోటే తిరిగి పోటీ చేయడం ఎందుకన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత ఎన్నికల్లో నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో రాజకీయంగా గ్రాఫ్ కోల్పోయినట్లయింది. ఓటమి ప్రత్యర్థులకు కూడా విమర్శలకు అవకాశమిచ్చింది. ఆయన ఇంత వరకూ నేరుగా ఎన్నికల్లో గెలవలేదని అంటూ వ్యంగ్యాస్త్రాలు కూడా విసిరారు.

నాలుగు దశాబ్దాలుగా...
మంగళగిరి నియోజకవర్గం టీడీపీకి అంత అనువైన నియోజకవర్గం కాదు. అది అందరికీ తెలిసిందే. 1985లోనే టీడీపీ గెలిచింది. ఆ తర్వాత మంగళగిరిలో గెలుపు రుచి సైకిల్ పార్టీ చూడలేదు. అంటే దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి మంగళగిరిలో టీడీపీ జెండా ఎగరలేదంటే అతిశయోక్తి కాదు. అంటే దాదాపు అందుకు అనేక కారణాలున్నాయి. అలాంటి నియోజకవర్గాన్నే చినబాబు ఎంచుకోవడమేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఓటమి చవి చూసిన చోటనే గెలుపును వెతుక్కోవడంలో తప్పులేదు. అలాగని మరీ సాహసానికి ఒడిగట్టకూడదన్నది కూడా ఆయన అర్థం చేసుకుంటే మంచిదన్న కామెంట్స్ సొంత పార్టీ నేతల నుంచే వినపడుతున్నాయి.
బలమైన అభ్యర్థిని...
మంగళగిరి నియోజకవర్గంలో ఈసారి కూడా లోకేష్ ను ఓడించేందుకు అధికార పార్టీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకే సీటు నో అని చెప్పేసింది. పార్టీకి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేసినా పట్టించుకోలేదు. చేనేత సామాజికవర్గానికి చెందిన గంజి చిరంజీవిని బరిలోకి దింపుతుంది. గంజి చిరంజీవి క్యాస్ట్ పరంగా బలమైన నేత. 2014 ఎన్నికల్లో గంజి చిరంజీవి ఆళ్ల రామకృష్ణారెడ్డిపై కేవలం ఏడు ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యారు. అంటే ఎంత బలమైన నేత అన్నది ప్రత్యేకంగా చెప్పలేము. ఏపీలో క్యాలిబర్ కంటే క్యాస్ట్ ను ఎక్కువగా ప్రజలు చూస్తారు. అందుకే గంజి చిరంజీవిని అధికార వైసీపీ అభ్యర్థిగా నిలబెడుతుంది. లోకేష్ గంజి చిరంజీవిని ఎదుర్కొనడం అంత ఆషామాషీ కాదు. అది ఆయనకు కూడా తెలుసు.
క్యాస్ట్ క్యాపిటల్ ను డామినేట్ చేస్తే...
కానీ నారా లోకేష్ మాత్రం మొండిగానే బరిలోకి దిగాలని డిసైడ్ అయ్యారు. గత ఎన్నికల్లో నారా లోకేష్ ఐదు వేల ఓట్లతో ఓటమి పాలయ్యారు. అయితే ఈసారి లోకేష్ కు మంగళగిరి నియోజకవర్గంలో ఒకటే ఒకటి పాజిటివ్ గా కనిపిస్తుంది. రాజధాని అంశం. టీడీపీ అధికారంలోకి వస్తే రాజధాని అమరావతిలోనే కొనసాగుతుంది కాబట్టి.. మంగళగిరి అభివృద్ధి చెందుతుందని ఏమైనా లోకేష్ వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయన్న విశ్లేషణలున్నాయి. అయితే అది కూడా ఆశ మాత్రమే. క్యాపిటల్ ను క్యాస్ట్ డామినేట్ చేస్తే మాత్రం లోకేష్ కు మరోసారి ఇబ్బందులు తప్పవన్నది రాజకీయ విశ్లేషకులు సయితం అంగీకరిస్తున్న విషయమే. దీంతో మరోసారి మంగళగిరి నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో హాట్ సీటుగా మారుతుంది.
Tags:    

Similar News