కొత్తగూడెం ఎమ్మెల్యే ఎపిసోడ్‌.. ఆసక్తికర మలుపు!

భారత రాష్ట్ర సమితి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావుపై తెలంగాణ హైకోర్టు సోమవారం అనర్హత వేటు వేసింది. కోర్టు తీర్పు నేప‌థ్యంలో

Update: 2023-07-26 11:15 GMT

భారత రాష్ట్ర సమితి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావుపై తెలంగాణ హైకోర్టు సోమవారం అనర్హత వేటు వేసింది. కోర్టు తీర్పు నేప‌థ్యంలో వనమా సమీప ప్రత్యర్థి అయిన జలగం వెంకట్రావు.. త‌న‌ను ఎమ్మెల్యేగా గుర్తించండని అసెంబ్లీ కార్యదర్శికి విజ్ఞ‌ప్తి చేశారు. డిసెంబర్ 12, 2018 నుండి తనను ఎమ్మెల్యేగా ప్రకటించిన హైకోర్టు తీర్పుతో వెంకట్ రావు రాష్ట్ర అసెంబ్లీ సెక్రటేరియట్‌ను ఆశ్రయించారు. హైకోర్టు ఉత్తర్వుల కాపీతో పాటు తన వ్యక్తిగత వివరాలన్నింటినీ స్పీకర్ కార్యాలయానికి సమర్పించి తనను ఎమ్మెల్యేగా ప్రకటించాలని అభ్యర్థించారు. వనమా వెంకటేశ్వరరావుపై 2019లో హై కోర్టులో పిటీషన్ వేసిన‌ట్లు జలగం వెంకట్రావు పేర్కొన్నారు.

వాదనలు విన్న కోర్టు తీర్పు ఇచ్చిందని.. తనను ఎమ్మెల్యేగా పరిగణించిందని తెలిపారు. వనమాను ఎమ్మెల్యే ప‌ద‌వి నుంచి హైకోర్టు డిస్ క్వాలిఫై చేసిందని, తనది నైతిక విజయమ‌ని జలగం పేర్కొన్నారు. అటు రాష్ట్ర అసెంబ్లీకి ఆయన అనుచరులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అదే సమయంలో హైకోర్టు అనర్హతా వేటు వేయడంతో పదవిని కాపాడుకునేందుకు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ప్రయత్నాలు చేస్తున్నారు. తనపై వేసిన అనర్హత పిటీషన్ పై సుప్రీంకోర్టు అప్పీల్‌కు వెళ్లాడానికి అవకాశం ఇవ్వాలని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు హైకోర్టులో పిటిషన్ వేశారు. వనమా పిటిషన్‌ని హైకొర్టు విచారణకు స్వీకరించింది.

ఇదిలా ఉంటే.. మంగళవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి రాధారాణి మాట్లాడుతూ.. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 125ఎ ప్రకారం ఎన్నికల అఫిడవిట్‌లో పూర్తి సమాచారాన్ని అందించడంలో వనమా విఫలమయ్యారని అన్నారు. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసినందుకు కోర్టు అతనికి రూ.5 లక్షల జరిమానా విధించారు. వెంకటేశ్వరరావు 2004, 2009, 2014 ఎన్నికల అఫిడవిట్‌లలో ఆస్తి యాజమాన్యం అని క్లెయిమ్ చేశారు. అవి తప్ప, వెంకటేశ్వరరావు తన భార్య ఆస్తి వివరాలను, హిందూ అవిభక్త కుటుంబం నుండి వచ్చిన ఆదాయాన్ని వెల్లడించలేదు. అభ్యర్థులు, వారి సహచరుల ఆస్తులు, ఆదాయ వనరులను బహిర్గతం చేయకపోవడం అవినీతికి పాల్పడుతుందని జస్టిస్ రాధారాణి అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News