కేసీఆర్ కామెంట్స్‌.. సజ్జల సెటైర్

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో కచ్చితంగా పవర్‌ కట్స్‌ ఉన్నాయన్నారు.

Update: 2023-06-23 14:19 GMT

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో కచ్చితంగా పవర్‌ కట్స్‌ ఉన్నాయన్నారు. తెలంగాణ పల్లెలకు వెళ్తే కరెంట్‌ ఎలా ఉంటుందో అందరికీ తెలుసునన్నారు. మన రాష్ట్రంలో గతంతో పోల్చితే ఇప్పుడు 28 శాతం విద్యుత్‌ వినియోగం పెరిగిందని తెలిపారు. సాంకేతికంగా ట్రిప్‌ ఇస్తే తప్ప.. రాష్ట్రంలో విద్యుత్‌ పంపిణీలో ఎలాంటి అవాంతరాలు లేవని సజ్జల పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఎకరం అమ్మితే ఏపీలో వందెకరాలు కొనచ్చంటున్నారని, అలా అయితే ముంబైలో ఎకరం అమ్మితే ఇంకా ఎక్కువ కొనవచ్చు, అమెరికాలో అమ్మితే 10 వేల ఎకరాలు కొనొచ్చు అంటూ సజ్జల సెటైర్ వేశారు.

కేసీఆర్‌ అలా ఎందుకు మాట్లాడారో అర్థం కాలేదన్నారు. ఎన్నికలు వస్తున్నందునే కేసీఆర్‌ అలా మాట్లాడి ఉండొచ్చని సజ్జల అన్నారు. నిన్న సీఎం కేసీఆర్ రెండు రాష్ట్రాల్లోనూ భూముల అభివృద్ధిని పోల్చి చూసి తెలంగాణలో ఒక ఎకరం అమ్మడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ఎకరాలు కొనుక్కోవచ్చని అన్నారు. తెలంగాణలో భూ అభివృద్ధి శరవేగంగా జరుగుతున్న తీరును ఎత్తిచూపేందుకు ఇలా అన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ నేతలు కౌంటర్‌ ఇవ్వడంతో భూముల విలువ వివాదం పెద్దదైంది. ఇప్పటికే ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మాట్లాడుతూ.. వైజాగ్‌లో ఒక ఎకరం భూమిని అమ్మడం ద్వారా తెలంగాణలో దాదాపు 150 నుంచి 300 ఎకరాలు కొనవచ్చని చెప్పారు. ఇప్పుడు కేసీఆర్‌కి మరో పెద్ద వైసీపీ నేత కౌంటర్‌ ఇచ్చారు.

పవన్‌ పెయిడ్‌ ఆర్టిస్ట్‌

జనసేన అధినేత పవన్‌ పొలిటీషియన్‌ కాదు.. పెయిడ్‌ ఆర్టిస్ట్‌ అంటూ వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పవన్‌ చదివేది చంద్రబాబు స్క్రిప్టేనన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును సీఎం చేయడానికి పవన్‌ కల్యాణ్‌ ప్రయత్నాలు చేస్తున్నారని సజ్జల అన్నారు. ఇటీవల జరిగిన మహానాడులో మిని మేనిఫెస్టోను ప్రవేశపెట్టి చంద్రబాబు నవ్వుల పాలయ్యారని అన్నారు. కులం కోసం నిలబడిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం అని అన్నారు. ముద్రగడ కులాన్ని వాడుకోలేదు.. త్యాగాలే చేశారన్నారు. పవన్‌ కులాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు. 

Tags:    

Similar News