ఏపీలో రంజుగా రాజకీయాలు.. స్పీడ్ పెంచిన పార్టీలు
ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు మహా రంజుగా సాగుతున్నాయి. రాష్ట్రంలో రాజకీయాలు మూడు
ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు మహా రంజుగా సాగుతున్నాయి. రాష్ట్రంలో రాజకీయాలు మూడు ముక్కలటాల ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో వైసీపీ ఉండగా, ప్రతిపక్షాలుగా టీడీపీ, జనసేన పార్టీలు ఉన్నాయి. వచ్చే ఈ మూడు పార్టీల భవితవ్యం తేలిపోనుంది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలను ఈ మూడు పార్టీలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఏ పార్టీ ఓడిపోయినా కూడా తర్వాత దాని ఉనికి కష్టమనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే మూడు పార్టీలు కూడా తమ ఎన్నికల కార్యకలాపాల్లో దూకుడు పెంచాయి. నిత్యం ప్రజల మధ్య ఉండేందుకు ప్లాన్లను రెడీ చేసుకుంటున్నాయి.
ఓటర్ల కటాక్షాల కోసం అని ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేపట్టాలని వైసీపీ చీఫ్ జగన్, టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఎవరి ప్లాన్ వారిదే, ఎవరి రూట్ వారిదే. అయితే తీర్పు చెప్పే ప్రజలు మాత్రం తమ నిర్ణయాన్ని బహిరంగ పర్చడం లేదు. రాజకీయ నాయకులు చేస్తున్న విన్యాసాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ.. ఇప్పుడు మరోసారి ఛాన్స్ ఇవ్వాలని కోరుతోంది. తాము మంచి చేశామని అనిపిస్తేనే ఓట్లు వేయాలంటోంది. తమ సంక్షేమ పథకాల వల్ల ప్రయోజనం చేకూరిందని అనుకుంటేనే తమకు మళ్లీ ఓట్లు వేయాలని సీఎం జగన్ అడుగుతున్నారు. ఈ విషయంలో వైఎస్ చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు.
మరోవైపు రానున్న ఎన్నికలు టీడీపీకి జనన మరణ సమస్యగా మారాయి. టీడీపీ ఉనికి కోసం, పార్టీని బ్రతికించుకోవడానికి అధినాయకత్వం ఎంతగానో కష్టపడుతోంది. ఈ ఎన్నికలు చంద్రబాబుకు అగ్నిపరీక్షగా మారనున్నాయి. చంద్రబాబు మరోసారి రాష్ట్రంలో అధికారం చేపట్టడానికి పావులు కదుపుతున్నారు. తమకూ ఒక ఛాన్స్ ఇవ్వాలని టీడీపీ, వైసీపీల పాలన చూసిన ప్రజలని జనసేన కోరుతోంది. ఇప్పటికే వారాహి విజయ యాత్ర పేరుతో పవన్ రాష్ట్ర పర్యటన చేస్తున్నారు. వైసీపీని టార్గెట్ చేసుకుని పవన్ ప్రసంగాలు కొనసాగుతున్నాయి. దీంతో ఓటరు మహాశయులు.. ఆయా పార్టీల నేతల మాటలు, వాగ్దానాలను ఇంట్రెస్ట్ కొద్ది వింటున్నారు. భవిష్యత్తులో ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.