Organ Donation:తెగిపోయిన చేతులు.. ఓ మహిళ కారణంగా తిరిగి వచ్చేశాయి
ఒక ఘోర ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయిన ఒక పెయింటర్.. మళ్లీ తన చేతుల్లోకి;
Organ Donation:ఒక ఘోర ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయిన ఒక పెయింటర్.. మళ్లీ తన చేతుల్లోకి కుంచెను తీసుకోబోతున్నాడు, ఢిల్లీ వైద్య బృందం చేసిన శస్త్రచికిత్స కారణంగా ఆ వ్యక్తికి చేతులు తిరిగి వచ్చాయి. ఒక మహిళ చేసిన అవయవ దానం.. నలుగురి జీవితాలలో వెలుగులు నింపింది. ఢిల్లీలో మొదటిసారి రెండు చేతులకు సర్జరీని చేశారు. 45 ఏళ్ల వ్యక్తి సర్ గంగా రామ్ ఆసుపత్రి నుండి బయటకు రానున్నాడు. అతను 2020లో రైలు ప్రమాదంలో తన రెండు చేతులను కోల్పోయాడు. నిరుపేద నేపథ్యం నుండి వచ్చిన అతని జీవితంలో ఇప్పుడు సరికొత్త వెలుగును వైద్యులు నింపారు.
బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించబడిన ప్రముఖ దక్షిణ ఢిల్లీ పాఠశాల మాజీ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ మీనా మెహతా చేతులు 45 ఏళ్ల వ్యక్తిని రక్షించాయి. మెహతా మరణించిన తర్వాత తన అవయవాలను ఇతరులకు ఉపయోగించమని కోరింది. ఆమె మూత్రపిండాలు, కాలేయం, కార్నియాలు మరో ముగ్గురికి మార్చాయి. ఆమె చేతులు పెయింటర్ కలలను పునరుద్ధరించాయి.బ్రెయిన్ డెడ్ మీనా మెహతా ఇచ్చిన రెండు చేతుల్ని మార్పిడి చేశారు వైద్యులు. మెడికల్ హిస్టరీలో భారత డాక్టర్లు కొత్త చరిత్రను సృష్టించారు. సుమారు 12 గంటల పాటు డాక్టర్లు ఈ సర్జరీ చేశారు. డోనార్, రిసిపియంట్ చేతులకు చెందిన అన్ని నరాలు, కండరాలను కలిపారు. డాక్టర్లు పడ్డ శ్రమ ఫలించింది. అతడికి చేతులు వచ్చాయి.