GNI స్టార్టప్స్ ల్యాబ్ ఇండియాలో స్థానం దక్కించుకున్న తెలుగుపోస్ట్
తెలుగుపోస్ట్ ఫ్యాక్ట్ చెక్ టీమ్ ద్వారా ఎప్పటికప్పుడు తప్పుడు వార్తలపై యుద్ధం చేస్తూనే ఉంది
గూగుల్ న్యూస్ ఇనీషియేటివ్ (Google News Initiative), ఎనీ మైండ్ గ్రూప్ (AnyMind Group), టీ హబ్ భాగస్వామ్యంతో GNI స్టార్టప్స్ ల్యాబ్ ఇండియా కోసం ఎంపిక చేసిన 10 వార్తల స్టార్టప్‌ల జాబితాను ప్రకటించారు. ఇందులో భాగంగా భారతీయ వార్తా స్టార్టప్‌లు ఆర్థిక, కార్యాచరణ స్థిరత్వాన్ని సాధిస్తాయి. భారతదేశం అంతటా 110 సంస్థలు ఇందు కోసం అప్లై చేయగా.. పది న్యూస్ స్టార్టప్‌లు మాత్రమే అర్హత సాధించాయి. పరిశోధనాత్మక, రాజకీయ, వైద్య, యువత, వాతావరణం, స్థానిక వార్తలతో సహా జర్నలిజానికి సంబంధించిన విభిన్న విభాగాలను ఈ సంస్థలు కవర్ చేస్తున్నాయి. తెలుగుపోస్ట్ కూడా ఇప్పటికే తన వైవిధ్యాన్ని చూపించింది. GNI స్టార్టప్స్ ల్యాబ్ ఇండియా కోసం ఎంపిక చేసిన 10 వార్తల స్టార్టప్‌ల జాబితాలో స్థానం దక్కించుకుంది.
తెలుగుపోస్ట్ ఎంతో విభిన్నమైన వార్తలను ప్రజలకు అందిస్తూ ఉంది. అంతేకాకుండా తెలుగుపోస్ట్ ఫ్యాక్ట్ చెక్ టీమ్ ద్వారా ఎప్పటికప్పుడు తప్పుడు వార్తలపై యుద్ధం చేస్తూనే ఉంది. తెలుగుపోస్ట్ చేస్తున్న కృషిని పలు మల్టీ నేషనల్ సంస్థలు గుర్తిస్తూ ఉన్నాయి. గూగుల్ సంస్థ కూడా తెలుగుపోస్ట్ చేస్తున్న కృషిని తాజాగా గుర్తించింది. గూగుల్ న్యూస్ ఇనీషియేటివ్ లో తెలుగుపోస్ట్ కూడా భాగమైంది. 300+ పైగా ప్రచురణకర్తలతో GNI ఇండియన్ లాంగ్వేజెస్ ప్రోగ్రామ్‌ను నిర్వహించింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఆయా పబ్లిషర్స్ ఆన్‌లైన్ ఉనికిని ఆధునీకరించడానికి ప్రయత్నించింది. వెబ్, యాప్, వీడియో ఫార్మాట్‌లలో వినియోగదారు అనుభవాలను మెరుగుపరచడానికి ఈ ప్రోగ్రామ్ ఎంతగానో కృషి చేసింది. దీని ద్వారా ఎక్కువ మంది వినియోగదారులు మరింత కంటెంట్‌ను మెరుగ్గా యాక్సెస్ చేయగలరు. ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్న సంస్థలు ఇప్పటికే వారి డిజిటల్ యాడ్ రాబడిలో పెరుగుదలను చూస్తున్నారు, ప్రేక్షకుల ఆదరణ ను మరింతగా పొందుతున్నారు.
ట్రూత్ సీరమ్ మీడియా ద్వారా నిర్వహిస్తున్న Telugupost.com, న్యూస్ రిపోర్టింగ్, ఫ్యాక్ట్-చెకింగ్‌కు అంకితమైన ప్రత్యేక విభాగాలతో సమగ్ర కవరేజీకి ప్రసిద్ధి చెందిన డిజిటల్ న్యూస్ పోర్టల్. భారతదేశంలో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కర్ణాటక, తమిళనాడు, ఇతర రాష్ట్రాలు), యునైటెడ్ స్టేట్స్, UK, మిడిల్ ఈస్ట్‌తో సహా డయాస్పోరా అంతటా గణనీయమైన రీడర్‌షిప్‌తో, మేము స్థిరంగా సగటున 5 మిలియన్ నెలవారీ పేజీ వ్యూస్ ను సొంతం చేసుకుంది. వ్యూవర్ షిప్ లో ప్రతి నెలా గణనీయమైన అభివృద్ధిని సాధిస్తూ ఉంది. IFCN సిగ్నటరీ అయిన తెలుగుపోస్ట్ విశ్వసనీయమైన పాత్రికేయత కు పెట్టింది పేరు.
జూలై 2023లో, GNI ఆయా సంస్థల ఆన్‌లైన్ ఉనికిని ఆధునీకరించడానికి.. వెబ్, యాప్, వీడియో ఫార్మాట్‌లలో వినియోగదారు అనుభవాలను మెరుగుపరచడానికి 300+ పైగా ప్రచురణకర్తలతో లాంగ్వేజెస్ ప్రోగ్రామ్‌ను కూడా పూర్తీ చేసింది. ఈ ప్రోగ్రామ్‌లకు సంబంధించిన ఫీడ్‌బ్యాక్ ఇప్పటికే డిజిటల్ యాడ్ రాబడిలో పెరుగుదల, మంచి వ్యూవర్ షిప్ రావడం ద్వారా చాలా ప్రోత్సాహకరంగా ఉంది.