IPL 2025 : నేడు సమఉజ్జీల పోరు
నేడు ఐపీఎల్ లో మరో కీలక మ్యాచ్ జరగనుంది. పంజాబ్ కింగ్స్ తో కోల్ కత్తా నైట్ రైడర్స్ మ్యాచ్ జరగనుంది.;

ఐపీఎల్ లో నేడు మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఇప్పటి వరకూ ఓడిపోతూ వస్తున్న జట్లు చిన్నగా విజయాల బాట పట్టాయి. వరస పరాజయాలు చవి చూస్తున్న జట్లు చిన్నగా పుంజుకుంటున్నాయి. సంగం సీజన్ అయిపోయిన నేపథ్యంలో ఇప్పటి వరకూ పేలవ ప్రదర్శన జట్లు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. తమ సత్తా ఏంటో ప్రత్యర్థులకు చూపుతున్నాయి. ప్లే ఆఫ్ కు వచ్చే జట్లను కూడా ఓడించి వారి ఆశలపై నీళ్లు కుమ్మరించేస్తున్నాయి. అందుకే ఐపీఎల్ లో చివరి నిమిషం వరకూ ఏ జట్లు ప్లే ఆఫ్ కు చేరుకుంటాయో చెప్పలేని పరిస్థితి ఉంది.
రెండు సమానంగా పాయింట్లతో...
నేడు ఐపీఎల్ లో మరో కీలక మ్యాచ్ జరగనుంది. పంజాబ్ కింగ్స్ తో కోల్ కత్తా నైట్ రైడర్స్ మ్యాచ్ జరగనుంది. ముల్లాన్ పూర్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జరగనుంది. కోల్ కత్తా నైట్ రైడర్స్ ఇప్పటి వరకూ ఆరు మ్యాచ్ లు ఆడి మూడు మ్యాచ్ లలో గెలిచి, మూడు మ్యాచ్ లలో ఓడిపోయింది. ఆరు పాయింట్లతో ఉంది. అలాగే పంజాబ్ కూడా ఐదు మ్యాచ్ లు ఆడి మూడు మ్యాచ్ లలో గెలిచి రెండు మ్యాచ్ లలో ఓటమి పాలయింది. పంజాబ్ కూడా ఆరు పాయింట్లతో ఉంది. రెండు జట్లు పాయింట్ల పట్టికలో సమానంగా ఉండటంతో ఈరోజు జరిగే మ్యాచ్ రెండు జట్లకు ప్రతిష్ఠాత్మకంగా మారింది.