IPL 2025 : నేడు సమ ఉజ్జీల పోరు
ఐపీఎల్ లో నేడు మరో సూపర్ మ్యాచ్ జరగనుంది. గుజరాత్ టైటాన్స్ తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది;

ఐపీఎల్ లో నేడు మరో సూపర్ మ్యాచ్ జరగనుంది. గుజరాత్ టైటాన్స్ తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జరగనుంది. రెండు జట్లు సమఉజ్జీలుగా ఉండటంతో ఈ మ్యాచ్ టెన్షన్ గా సాగే అవకాశాలున్నాయి. ఇప్పటికే గత రెండేళ్ల నుంచి రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లలో మూడు గుజరాత్ టైటాన్స్ గెలవగా, రెండు పంజాబ్ కింగ్స్ గెలిచింది.
గుజరాత్ టైటాన్స్ తో పంజాబ్ కింగ్స్...
రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. నాలుగు మ్యాచ్ లు చివరి ఓవర్ వరకూ ఉత్కంఠ వరకూ సాగడంతో ఈ మ్యాచ్ కూడా అభిమానులను మునివేళ్లపై నిలబడేలా చేస్తుందన్న అంచనాలున్నాయి. ఇరు జట్లు బౌలింగ్, బ్యాటింగ్ లలో పటిష్టంగా ఉన్నాయి. మంచి ఫామ్ మీద ఉన్న ప్లేయర్లు ఉండటంతో స్టేడియంలో సిక్సర్ల మోత మోగే అవకాశాలున్నాయి.