నేటి నుండి ఆసియా కప్.. ఫ్రీగా చూడాలంటే ఇలా..!

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ఆసియా కప్-2023 ఆగస్ట్ 30న

Update: 2023-08-30 02:36 GMT

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ఆసియా కప్-2023 ఆగస్ట్ 30న ప్రారంభం అవ్వనుంది. టోర్నమెంట్ మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్, నేపాల్ తలపడనున్నాయి. ఈ ఈవెంట్‌ను పాకిస్తాన్, శ్రీలంక సంయుక్తంగా హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించనున్నారు. ఇంతకు ముందు ఆసియా కప్ ఎడిషన్ ను T20 ఫార్మాట్ లో నిర్వహించగా.. ఈసారి వన్డే ఇంటర్నేషనల్ (ODI) ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. గత ఏడాది జరిగిన ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్తాన్‌పై శ్రీలంక విజయం సాధించింది.

ఆసియా కప్ 2023లో మొత్తం ఆరు టీమ్‌లు పాల్గొననున్నాయి. మొత్తం 13 మ్యాచులు జరగనున్నాయి. సెప్టెంబర్ 17న ఫైనల్ మ్యాచు జరగనుంది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ - నేపాల్‌ తలపడనున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. పాకిస్థాన్‌లోని ముల్తాన్‌ వేదికగా టోర్నీ ఆరంభ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలకు బీసీసీఐ చీఫ్ రోజర్ బిన్నీ హాజరవుతారని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు జకా అష్రాఫ్ వెల్లడించారు. మొత్తం 6 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటాయి. భారత్, పాకిస్తాన్‌, నేపాల్‌ ‌ జట్లు గ్రూపు-ఏ లో ఉండగా.. ఆఫ్గానిస్తాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ గ్రూపు-బిలో ఉన్నాయి. మొత్తం మ్యాచుల్లో పాకిస్థాన్‌లో 4 మ్యాచులు, మిగతా 9 శ్రీలంక వేదికగా నిర్వహించనున్నారు. పాకిస్థాన్ జట్టు ఆడే మ్యాచ్‌లు వారి సొంతగడ్డపై, భారత్ ఆడబోయే మ్యాచ్‌లు శ్రీలంక వేదికగా జరగనున్నాయి.
ఆసియా కప్ మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ ప్రసారం చేయనుంది. మొబైల్ వినియోగదారులు ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ+హాట్ స్టార్(Disney + Hotstar) లో ఆసియా కప్ మ్యాచ్‌లను చూడొచ్చు. మొబైల్ వినియోగదారులు ఉచితంగా మ్యాచ్ లను చూడొచ్చని డిస్నీ+హాట్ స్టార్ ఇప్పటికే ప్రకటించింది. హాట్‌స్టార్‌లో తెలుగు కామెంట్రీ అందుబాటులో ఉంటుంది.


Tags:    

Similar News