IPL 2025 : క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ షెడ్యూల్ విడుదల

ఈ ఏడాది ఐపీఎల్ షెడ్యూల్ ను బీసీసీఐ విడుదల చేసింది. మార్చి 23వ తేదీ నుంచి ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్ ప్రారంభమవుతుంది;

Update: 2025-01-12 12:38 GMT

క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ సీజన్ మొదలయిందంటే చాలు ఇక కావాల్సినంత కిక్కు. రోజుకు రెండు మ్యాచ్ లు చూసే అవకాశం ఒక్క ఐపీఎల్ లోనే లభిస్తుంది. అందుకే ప్రతి ఏటా ఐపీఎల్ కు ఆదరణ పెరుగుతూనే ఉంటుంది. అయితే ఈ ఏడాది ఐపీఎల్ షెడ్యూల్ ను బీసీసీఐ విడుదల చేసింది. మార్చి 23వ తేదీ నుంచి ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్ ప్రారంభమవుతుందని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు.

ఫైనల్ మ్యాచ్ మే 25వ తేదీన...
మే 25వ తేదీన ఫైనల్ మ్యాచ్ ఉంటుందని ఆయన చెప్పారు. బీసీసీఐ ప్రత్యేక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఐపీఎల్ కోసం ఇప్పటికే అన్ని ఫ్రాంచైజెస్ ఆటగాళ్లను వేలం ద్వారా కొనుగోలు చేసింది. ఐపీఎల్ సీజన్ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. సో.. ఇక పూర్తి స్థాయి షెడ్యూల్ ను త్వరలోనే వెల్లడిస్తామని త్వరలోనే చెబుతామని రాజీవ్ శుక్లా వెల్లడించారు. అంటే దాదాపు రెండు నెలల పాటు ఐపీఎల్ సీజన్ జరగనుంది.


Tags:    

Similar News