
ఐపీఎల్ 2025 షెడ్యూల్ బీసీసీఐ విడుదలచేసింది. 18వ ఎడిషన్ ప్రీమియర్ లీడ్ పూర్తి స్థాయి విడుదల కావడంతో ఇక క్రికెట్ ఫ్యాన్స్ కు పండగేనని చెప్పాలి. మార్చి 22 నుంచి మే 25వ తేదీ వరకూ వరసగా ఐపీఎల్ మ్యాచ్ లు జరగనున్నాయి. మొత్తం 74 మ్యాచ్ లు 65 రోజుల పాటు కొనసాగుతుండటంతో దాదాపు రెండు నెలలు చూసినోళ్లకు చూసినంత అని చెప్పాలి.
తొలి మ్యాచ్ మార్చి 22న
తొలి మ్యాచ్ మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కత్తా నైటర్ రైడర్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మధ్య కోల్ కత్తా లోని ఈడెన్ గార్డెన్స్ లో జరగనుంది. మార్చి 23న ఉప్పల్ వేదికగా హైదరాబాద్ సన్ రైజర్స్ తో రాజస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఐపీఎల్ సీజన్ ఈ నెలలోనే జరగనుంది. ఇది 18వ ఎడిషన్ కావడంతో ఈ సారి ఏ జట్టు ఛాంపియన్ గా నిలుస్తుందన్న దానిపై భారీ ఎత్తున బెట్టింగ్ లుకూడా ప్రారంభమయ్యే అవకాశముంది.