నేడు కీలక మ్యాచ్.. భారత్ - పాక్ మధ్య చావో రేవో మ్యాచ్

నేడు ఛాంపియన్ ట్రోఫీలో కీలకమైన మ్యాచ్ జరుగుతుంది. భారత్ - పాకిస్థాన్ ల మధ్య జరుగుతున్న మ్యాచ్ కోసం ఇరుజట్లు సిద్ధమయ్యాయి;

Update: 2025-02-23 01:59 GMT
india, pakistan, champions trophy, dubai
  • whatsapp icon

నేడు ఛాంపియన్ ట్రోఫీలో అతి కీలకమైన మ్యాచ్ జరుగుతుంది. భారత్ - పాకిస్థాన్ ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ కోసం ఇరుజట్లు సిద్ధమయ్యాయి. దుబాయ్ వేదికగా మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. గణాంకాలు చూస్తే భారత్ కు అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ, న్యూజిలాండ్ పై ఇప్పటికే ఓడిపోయిన పాక్ ఈ మ్యాచ్ లో చావో రేవో తేల్చుకోవడానికి సిద్ధమయింది.

తొలి గెలుపుతో...
భారత్ బౌలింగ్, బ్యాటింగ్ పరంగా పటిష్టంగా కనిపిస్తుంది. బంగ్లాదేశ్ మీద తొలి గెలుపుతో మంచి ఊపు మీద ఉంది. సీనియర్ ఆటగాళ్లు ఫామ్ లోకి రావడం శుభపరిణామంగా చూడాలి. ఈ పరిస్థితుల్లో భారత్ - పాక్ మధ్య జరుగుతున్న మ్యాచ్ ను చూసేందుకు రేపు కోట్లాది మంది ఇరు జట్ల అభిమానులు ఎదురు చూపులు చూస్తున్నారు. గెలుపు ఎవరిది అన్నది మాత్రం ఇంకా తేలలేదు. టాస్ గెలిచిన వారికి కొంత అడ్వాంటేజీ ఉండే అవకాశముందన్నది క్రీడా నిపుణుల అంచనా.


Tags:    

Similar News