IPL 2025 : నేడు మరో హాటెస్ట్ మ్యాచ్
ఈరోజు ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతుంది. లక్నో వేదికగా రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది;

ఐపీఎల్ లో మ్యాచ్ లు మంచి పసందుగా జరుగుతున్నాయి. చివరకు వచ్చేసరికి ఇప్పటి వరకూ ఫామ్ లో లేని జట్లు తిరిగి పుంజుకుంటున్నాయి. విజయాలను అందుకుంటున్నాయి. వరస విజయాలను చవిచూసిన జట్లు ఇప్పుడు కొంత తడబడతున్నాయి. అందుకే ఐపీఎల్ లో ఏ జట్టు ఎప్పుడు ఎలా పుంజుకుంటుందన్నది ఎవరికి అర్ధం కాదు.
చెన్నై పుంజుకుంటుందా?
ఈరోజు ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతుంది. లక్నో వేదికగా రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఇప్పటి వరకూ లక్నో సూపర్ జెయింట్స్ ఆరు మ్యాచ్ లు ఆడి నాలుగింటిలో గెలిచింది. మంచి ఫామ్ లో ఉంది. రెండు మ్యాచ్ లలో ఓటమి పాలయింది. అదే చెనన్నై సూపర్ కింగ్స్ మాత్రం ఆరు మ్యాచ్ లు ఆడి ఐదింటిలో ఓడి ఒక్క మ్యాచ్ లో మాత్రమే గెలిచింది. టేబుల్ లో చివరి స్థానంలో ఉంది. అయితే ఈ మ్యాచ్ లో చెన్నై పుంజుకునే అవకాశాలున్నాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి.