IPL 2025 : ఎట్టకేలకు చెన్నైకు విజయం.. ఇక పుంజుకునేనా?
లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది;

ఐపీఎల్ 18వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ గతంలో ఎన్నడూ లేని విధంగా తత్తరపాటుకు గురవుతుంది. వరస ఓటములు.మంచి ఫామ్ లో ఉన్న జట్టు అయినా, అంచనాలతో దిగిన బ్యాచ్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ ప్రతి మ్యాచ్ లో ఓటమి చవి చూడాల్సిందే. ఎక్కడ లోపమో? ఎక్కడ శాపమో తెలుసుకునేలోపు సగం సీజన్ అయిపోయింది. అయితే చాలా రోజులకు చెన్నై సూపర్ కింగ్స్ పుంజుకున్నట్లు కనిపించింది. నిన్న జరిగిన లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ లోనూ చెన్నై తన పాత స్టయిల్ కు వచ్చేసింది. మహేంద్ర సింగ్ థోని కెప్టెన్సీలో చెన్నై ఈ సీజన్ లో తొలి విజయాన్ని అందుకుంది.
బౌలింగ్ లో అడ్డుకుని...
తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ ను చెన్నై సూపర్ కింగ్స్ ఎక్కువ పరుగులు చేయకుండా కొంత అడ్డుకోగలిగింది. లక్నో సూపర్ జెయింట్్ లో మార్ క్రమ్ ఆరు పరుగులకే అవుటయ్యాడు. 30 పరుగులు చేసి ఊపుమీదున్న మార్ష్ ను జడేజా వెనక్కు పంపాడు. సిక్సర్లు, ఫోర్లతో రెచ్చిపోయే పూరన్ కూడా ఎనిమిది పరుగులుకే అవుటయ్యాడు. పంత్ మాత్రమే కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 62 పరుగులు చేయగలిగాడు. బదోని మూడు సార్లు అవుట్ నుంచి బబయటపడి చివరకు థోని చేతికి దొరికపోయాడు. సమద్ ఇరవై పరుగులు చేశాడు. మొత్తం లక్నో సూపర్ జెయింట్స్ ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 166 పరుగులు మాత్రమే చేసింది.
తక్కువ స్కోరు అయినా...
అయితే గత మ్యాచ్ లు చూసిన వారందరికీ చెన్నై సూపర్ కింగ్స్ కు ఇది అతి పెద్ద స్కోరుగానే కనిపించింది. ఛేదనలో ఈ స్కోరును అధిగమిస్తుందా? లేదా? అన్న సందేహం ప్రతి ఒక్కరిలోనూ కనిపించింది. అనుకున్నట్లుగానే రషీద్ 27 పరుగులు చేసి అవుటయ్యాడు. రచిన్ రవీంద్ర 37 పరుగులు చేసి వెనుదిరిగి నిరాశపర్చాడు. రాహుల్ త్రిపాఠి కూడా తొమ్మిదిపరుగులు చేసి అవుట్ కావడంతో చెన్నై సూపర్ కింగ్స్ లో ఏమాత్రం మార్పు రాలేదని అనిపించింది. అయితే శివమ్ దూబె నాటౌట్ గా నిలిచి 43 పరుగులు, ధోని నాటౌట్ గా ఉండి 26 పరుగులు చేయడంతో చెన్నై సూపర్ కింగ్స్ కు ఈ సీజన్ లో రెండో విజయం లభించినట్లయింది. చెన్నై సూపర్ కింగ్స్ మొత్తం19.3 ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసి విజయం సాధించింది. పరవాలేదనిపించింది.