IPL 2025 : ఆహా ఏమి సిక్సర్లు.. బంతి వైపు చూస్తూనే... క్రికెట్ ఫ్యాన్స్ చూపు స్టాండ్స్ వైపే

విశాఖ జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ కాపిటల్స్ జట్టు లక్నో సూపర్ జెయింట్స్ పై విజయం సాధించింది;

Update: 2025-03-25 01:30 GMT
delhi capitals, ucknow supergiants, IPL 2025, visakhapatnam
  • whatsapp icon

విశాఖ స్టేడియంలో బ్యాటర్లు విజృంభించారు. ఢిల్లీ కాపిటల్స్ జట్టు లక్నో సూపర్ జెయింట్స్ పై విజయం సాధించింది. అయితే టెన్షన్ మధ్య సాగిన ఈ మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్ ను అలరించింది. ఎన్ని సిక్సర్లు.. బాణాసంచాల మాదిరిగా బంతి పెవిలియన్ వైపు వెళుతుంటే ప్రేక్షకులు తల పైకెత్తే చూడాల్సి వచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ లో మిచెల్ మార్ష్ పరుగుల వరద పారించారు. 77 పరుగులు చేసి అవుటయ్యాడు. పూరన్ 75 పరుగులు చేశాడు.మార్ష్ ఆరు సిక్సర్లు, పూరన్ ఏడు సిక్సర్లు బాది లక్నో సూపర్ జెయింట్స్ కు భారీ స్కోరు సాధించిపెట్టడంలో ముందున్నారు. ఇద్దరూ కలసి పరుగులు భారీగా చేయడంతో లక్నో సూపర్ జెయింట్స్ ఎనిమిది వికెట్లు నష్టపోయి 209 పరుగులు చేసింది.

భారీ స్కోరు సాధించినా...

ఢిల్లీ కాపిటల్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు, కులదీప్ యాదవ్ రెండు, ముఖేశ్ కుమార్, నిగమ్ చెరో వికెట్ తీయగలిగారు. అయితే 209 పరుగులు చిన్న లక్ష్యమేమీ కాదు. కేవలం 19.3 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 210 పరుగులు సాధించి విజయాన్ని అందుకుంది. ఢిల్లీ కాపిటల్స్ జట్టులో అశుతోష్ శర్మ 66 పరుగుల చేసి జట్టును ఆదుకున్నాడు. మొత్తం ఐదు సిక్స్ లు కొట్టాడు. స్టబ్స్ కూడా 34 పరుగుల చేసి పరవాలేదనిపించాడు. తర్వాత విప్రజ్ నిగమ్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. 39 పరుగులు మాత్రమే చేసినా అది ఢిల్లీకి కీలకంగా మారాయి.
లక్ష్య సాధనలో...
లక్నో సూపర్ జెయింట్స్ లో శార్దూల్ ఠాకూర్, సిద్ధార్థ్, దిగ్వేశ్, రవి బిష్ణోయ్ అందరూ తలా రెండు వికెట్లు తీశారు. ఛేదనలో బరిలోకి దిగిన ఢిల్లీ కాపిటల్స్ కు ఓపెనర్లు అవుటయి మ్యాచ్ లక్నో వైపు మళ్లిందనిపించింది. ఫ్రేజర్, అభిషేక్ పొరెల్, సమీర్ రిజ్వి తక్కువ పరుగులకే అవుట్ కావడంతో ఢిల్లీ కష్టాల్లో పడినట్లు కనిపించింది. అయితే లక్షర్ పటేల్, డుప్లెసిస్ నిలబడి ఆడి లక్నో విజయానికి ప్రధాన కారణమాయ్యారు. 65 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ గెలుస్తుందని అంచనాలను వమ్ము చేస్తూ అశుతోష్ శర్మ దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పెంచాడు. తర్వాత విప్రజ్ కూడా విజృంభించి ఆడటంతో ఢిల్లీ విజయం ఖాయమయింది. అయితే చివరి మూడు బాల్స్ వరకూ విజయం ఎవరిదన్న ఉత్కంఠ నెలకొంది. కానీ అశుతోష్ 19 ఓవర్లలో రెండు సిక్స్ లు బాదడంతో పాటు మరో బాల్ ను సిక్స్ కొట్టి ఇన్నింగ్స్ ను ముగించాడు. విజయం ఢిల్లీకి దక్కడానికి కారణం అశుతోష్ కారణమని చెప్పకతప్పదు.


Tags:    

Similar News